
Ram Charan Crush: స్టార్ హీరోలంటే అందమైన భామలతో జతకడతారు. ఆడిపాడతారు. అయితే అదంతా యాంత్రికమే. మనసుకు నచ్చే వాళ్ళు కొందరు మాత్రమే ఉంటారు. అలా తన మనసు దోచిన హీరోయిన్ ఎవరో చెప్పారు రామ్ చరణ్. ఇటీవల రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీ మొదటి క్రష్ ఎవరని యాంకర్ అడగడం జరిగింది. అప్పుడు చరణ్… హాలీవుడ్ స్టార్ లేడీ జూలియా రాబర్ట్స్ పేరు చెప్పారు. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. జూలియా రాబర్ట్స్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు కన్నార్పకుండా అలానే చూస్తుండిపోతాను. ఆమె నా క్రష్. ప్రెట్టీ ఉమన్ సినిమా చూశాక నేను ఆమెకు వీరాభిమాని అయ్యాను.. అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
అలాగే కేథరిన్ జెటా జోన్స్ అంటే కూడా చాలా ఇష్టం. నేను చూసిన ఆమె మొదటి చిత్రం మార్క్ ఆఫ్ జోరో. ఆ మూవీలో కేథరిన్ నటన నేను చాలా ఎంజాయ్ చేశాను.. అని రామ్ చరణ్ తనకు ఇష్టమైన, మనసు దోచిన హీరోయిన్స్ పేర్లు చెప్పాడు. టాలీవుడ్, బాలీవుడ్ దాటి… చరణ్ తన ఇష్టాన్ని హాలీవుడ్ భామల మీద చూపించాడు.
ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలోని చరణ్ నటన అద్భుతం అంటూ అమెరికన్ నటులు, దర్శకులు కొనియాడడం విశేషం. ఆర్ ఆర్ ఆర్ లో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చరణ్ అందరి మనసులు దోచారు. గోల్డెన్ గ్లోబ్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ ఆస్కార్ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ ఆర్సీ 15 పూర్తి చేసే పనిలో ఉన్నారు. దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. పాన్ ఇండియా మూవీగా ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు.

అనంతరం దర్శకుడు బుచ్చిబాబుతో చరణ్ మూవీ కమిట్ అయ్యారు. ఉప్పెన చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ నమోదు చేసిన బుచ్చిబాబు తన స్క్రిప్ట్ తో రామ్ చరణ్ ని మెప్పించారు. అందుకే కొత్త దర్శకుడు అయినప్పటికీ ఆఫర్ ఇచ్చాడు. రెండేళ్లు వేచి చూసిన బుచ్చిబాబు రామ్ చరణ్ తో ప్రాజెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఇదే ఏడాది బుచ్చిబాబు మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే ఏడాది విడుదల కానుంది.