
Balakrishna Troll: సినిమా అంటేనే అందమైన అబద్ధం. అందులో వచ్చే సన్నివేశాలు అద్భుత కల్పనలు.. ఇవన్నీ ఎప్పుడు విజయవంతమవుతాయి అంటే ప్రేక్షకులను మెప్పించినప్పుడు. మేం తీసింది ఎలాగూ చూస్తున్నారు అని భ్రమపడి ఏది పడితే అది తీసి బలవంతంగా రుద్దితే ఈడ్చి కొడతారు.. కానీ ఇలాంటివి ఎన్ని జరిగినా ఆ బ్లడ్ బ్రీడ్ బాలయ్య మారడు. ఆఫ్ కోర్స్ మారితే ఆయన బాలయ్య ఎందుకవుతాడు? ఇప్పుడే కాదు… ఆయన కెరియర్ మొదలుపెట్టిన తొలి రోజుల్లోనూ అతి గా సినిమాల్లో నటించేవారు. ఫైట్లు కూడా అదేవిధంగా ఉండేవి.. అప్పుడు సోషల్ మీడియా ఇంత బలంగా లేదు కాబట్టి చెల్లుబాటు అయింది.. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా!
అప్పట్లో బాలయ్య హీరోయిన్ రాధతో ఎక్కువగా జోడి కట్టేవారు.. ఆ సినిమాలు మొత్తం ప్రేమ కథ నేపథ్యంలో ఉండేవి.. ఆ ప్రేమను పెద్దలు ఒప్పుకోరు కాబట్టి… ఆ ప్రేమను గెలిపించుకునేందుకు హీరోలు ఫైట్స్ చేయాల్సి వచ్చేది.. కానీ ఆ ఫైట్లు పూర్తి విభిన్నంగా ఉండేవి.. అప్పట్లో సినిమా ఇంత అభివృద్ధి చెందలేదు కాబట్టి.. జనం అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా కాదు కదా. అయినప్పటికీ బాలయ్య అదే రూట్ లో కొనసాగుతున్నాడు.. అదే రక్తం, అదే కత్తి, అదే హింసాత్మకం..

మొన్నటికి మొన్న విడుదలైన వీర శివారెడ్డి పాత్ర కూడా అంతే.. బాలకృష్ణ గట్టిగా ఒక తన్ను తన్నుతే మహేంద్ర స్కార్పియో లేచి అవతలపడుతుంది. కత్తితో నరికితే తల ఎక్కడో ఎగిరి పడుతుంది.. ఇప్పటి ఓటీటీ రోజుల్లోనూ అదేపంథా కొనసాగిస్తే ఎలా బాలయ్య? అన్నట్టు దీనిని ఎంజాయ్ చేసే ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మొన్న అమెరికాలో వీర శివారెడ్డి సినిమా విడుదలైనప్పుడు అక్కడి నందమూరి అభిమానులు చేసిన రచ్చ అంత ఇంత కాదు.. బాలయ్య మామూలుగా నటిస్తే వారికి ఎక్కదట! అందుకే ఆయన అతి నటన మాకు కావాలి నినాదాలు చేస్తున్నారు కూడా.. అందుకే ఆయన మారడు.. ఎంతైనా బ్లడ్ బ్లడ్ వారసత్వం కదా!
#Balayya majaka.. 😂🤣😂🤣#jaibalayya
PS: ignore the audio enjoy the video 😉 pic.twitter.com/qPQlyQh1gm
— Prakash Aluru (@iPrakashAluru) January 28, 2019