
Chiranjeevi Comments On Suman: స్టార్ గా చిరంజీవి చాలా బిజీ. అయినా తన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనిస్తూనే ఉంటారు. మంచి విషయాలు, వ్యక్తుల గురించి స్పందిస్తూ ఉంటారు. సహ నటుడు సుమన్ 45 సంవత్సరాల సినిమా ప్రస్థానం పూర్తి చేస్తున్న తరుణంలో చిరంజీవి స్పందించారు. ఒక స్పెషల్ వీడియో చేసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. మై డియర్ సుమన్ 45 సంవత్సరాల సినిమా ప్రయాణం పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. పది భాషల్లో 500కి పైగా చిత్రాల్లో నటించారు మీరు. అది గొప్ప ఘనత.
అలాగే విలక్షణమైన పాత్రలో ఆకట్టుకున్నారు. మీ కమిట్మెంట్, హార్డ్ వర్క్ ఏమిటో… మీరు నటించిన సినిమాలే చెబుతాయి. మరిన్ని సంవత్సరాలు మీరు వెండితెరపై అభిమానులను అలరించాలి. ఈ సందర్భంగా బెంగుళూరులో ఫిబ్రవరి 16న ఏర్పాటు చేసిన అభినందన సభ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. ఆ దేవుని కృప నీతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను’ అని భావోద్వేగ శుభాకాంక్షలు చెప్పారు.
చిరంజీవి-సుమన్ కెరీర్స్ దాదాపు ఒకే సమయంలో మొదలయ్యాయి. ఇద్దరూ పోటాపోటీగా ఎదిగారు. ఒక దశలో ఇద్దరి మధ్య మంచి పోటీ కూడా నడిచింది. ఇక తమిళనాడులో పుట్టిన సుమన్ తెలుగులోనే పాపులర్ అయ్యారు. ఆయన్ని టాలీవుడ్ ఆడియన్స్ అక్కున చేర్చుకున్నారు. ఆయన కన్నడ మూలాలు ఉన్న నటుడు. 90లలో వరుసగా తెలుగులో చిత్రాలు చేశారు. ఆయనకు ఇక్కడ భారీగా అభిమానులు ఉన్నారు.

హీరోగా ఫేడ్ అవుట్ అయ్యాక క్యారెక్టర్ రోల్స్ చేయడం స్టార్ట్ చేశారు. దర్శకుడు శంకర్ తెరకెక్కించిన శివాజీ మూవీతో పూర్తి స్థాయి విలన్ గా మారారు. శివాజీలో ఆయన విలనిజం చాలా భిన్నంగా ఉంటుంది. అన్నమయ్య, శ్రీరామదాసు చిత్రాల్లో దేవుళ్ళ పాత్రల్లో సుమన్ అలరించారు. వెంకటేశ్వర స్వామి, రాముడు పాత్రలు ఆయనకు అద్భుతంగా సెట్ అయ్యాయి. 1979లో నీచల్ కులమ్ అనే తమిళ మూవీతో మొదలైన ఆయన ప్రస్థానం విరామం లేకుండా కొనసాగుతుంది. చక్కని రూపం, యాక్టింగ్, ప్రొఫెషనల్ ఫైటర్ కావడం ఆయనకు కలిసొచ్చాయి. ముఖానికి మేకప్ వేసుకున్నాక ఒక్క ఏడాది కూడా విరామం లేకుండా నటించిన నటుడు సుమన్.
Megastar @KChiruTweets congratulations actor #Suman on completing 45 years in films. #Chiranjeevi pic.twitter.com/IxsDOoyryV
— Suresh PRO (@SureshPRO_) February 15, 2023