
Ram Charan: ఛాలెంజింగ్ రోల్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన స్టార్ హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు కచ్చితంగా ఉంటుంది.కెరీర్ ప్రారంభం లో వరుసగా రొటీన్ సినిమాలు చేస్తున్నాడు అనే కామెంట్స్ రామ్ చరణ్ పై వస్తూ ఉండేవి.అలాంటి రామ్ చరణ్ నుండి రంగస్థలం లాంటి సినిమాతో నటనలో తన ప్రతిభ ఏమిటో చూపించాడు,ఇక #RRR చిత్రం తో ఆస్కార్ అవార్డు గెలుపునకు కారణమై గ్లోబల్ స్టార్ ఇమేజి సంపాదించాడు.
అలాంటి రామ్ చరణ్ ప్రస్తుతం సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ చిత్రం పూర్తి అవ్వగానే ఆయన చెయ్యబొయ్యే మరో సినిమా కూడా ఫిక్స్ అయిపోయింది.ఉప్పెన సినిమా తో భారీ హిట్ ని అందుకున్న బుచ్చి బాబు తో ఒక రురల్ బ్యాక్ డ్రాప్ తో సాగే పీరియడ్ సినిమాలో నటించబోతున్నాడు.

ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని, ఇది నా కెరీర్ లో రంగస్థలం కంటే గొప్ప చిత్రం నిలుస్తుందని రామ్ చరణ్ ఇది వరకే ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు.ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.
అదేమిటంటే ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడని,అందులో ఒక పాత్రకి కాళ్ళు ఉండవని, ఆ పాత్ర తమ్ముడు కూడా రామ్ చరణే అని, ఆయన కబ్బడి టీం కి కెప్టెన్ గా ఈ సినిమాలో వ్యవహరిస్తాడని తెలిసింది.అన్నయ్య ఆశయాన్ని నెరవేర్చే తమ్ముడిగా ఈ కథ ఉంటుందట.కథ రొటీన్ అనిపిస్తున్నా టేకింగ్ మరియు స్క్రీన్ ప్లే విషయం లో ఎవ్వరూ ఊహించని రేంజ్ లో ఉంటుందని సమాచారం.ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరికొన్ని పూర్తి వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.