
Upasana: మెగా ఫ్యామిలికి సంబంధించి ఏ న్యూస్ అయినా ఇట్టే వైరల్ అవుతుంది. రామ్ చరణ్ సతీమణి ఉపాసన సినిమాల్లో నటించకపోయినా ఇతర కార్యక్రమాల ద్వారా ఫేమస్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంటారు. లేటేస్టుగా ఈ మెగా కోడలు చేసిన ఓ పనికి నెటిజన్లంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ కోడలు అందరు మెచ్చే పనులే చేస్తారంటూ కొందరు కామెంట్లు పెట్టడం విశేషం. ఇంతకీ ఆమె చేసిన పనికి ఎందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏ పని చేసింది?
అపోలో హాస్పిటల్ గ్రూప్స్ డైరెక్టర్ గా ఉన్న ఉపాసన ఇతర సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వీటి ద్వారా వచ్చిన సొమ్మును సొంతానికి వాడుకోకుండా విరాళంగా ఇస్తుంటారు. తాజాగా ఆమె జూబ్లిహిల్స్ లోని హౌజ్ ఆఫ్ టాటా నుంచి జోయా కొత్త స్టోర్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపాసన ఆభరణాలతో మెరిసిపోయారు. అయితే ఈ స్టోర్ ను ప్రారంభించినందుకు ఆమెకు యాజమాన్యం పారితోషికం అందించారు. అయితే ఈ నగదును ఆమె సొంతానికి వాడుకోకుండా దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ డెవలప్ మెంట్ ట్రస్ట్, దాని కార్యక్రమాలకు విరాళంగా అందించారు. అణగారిన వర్గాల మహిళలు ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు సన్నిహితులు తెలుపుతున్నారు.
చాలా మంది సినీ సెలబ్రెటీలో ఓ వైపు సనిమాలు, మరోవైపు యాడ్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ సేవా కార్యక్రమాలు చేయడం చాలా తక్కువే. కానీ ఉపాసన సినీ సెలబ్రెటీ కాకపోయినా ఆమెకు వచ్చే మొత్తాన్ని ఇలా విరాళంగా ఇవ్వడంపై అందరూ ప్రశంసిస్తున్నారు. ఇతరులకు సాయం చేయాలన్న ఆలోచన వచ్చి.. మెగా కోడలు అని అనిపించుకున్నారని అందరూ ఆమెను కొనియాడుతున్నారు.

ఉపాసన స్వస్థలం దొమకొండ అని తెలిసిన విషయమే. రామ్ చరణ్ తో ఆమె వివాహ రిసెప్షన్ ఇందులోనే నిర్వహించారు. గతంలో ఓ సందర్బంగా చిరంజీవితో సహా మెగా కుటుంబ సభ్యులంతో ఇక్కడికి వచ్చి సందడి చేశారు. అంతకు ముందు పెద్దగా గుర్తింపు రానీ ఈ కోటకు ఉపాసన మ్యారేజ్ తరువాత పేరు గాంచిందని కొందరు అనుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఉపాసన చేసిన సాయంపై సోషల్ మీడియా వ్యాప్తంగా అందరూ ఆమెను ప్రశంసిస్తున్నారు.