
Rajamouli: రాజమౌళి కుటుంబం చాలా పెద్దది. వీరందరూ సినిమా నేపథ్యంతో ముడిపడి ఉన్నారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్. ఆయన అన్నయ్య శివశక్తి దత్త కూడా రచయితే. గతంలో విజయేంద్ర ప్రసాద్-శివశక్తి దత్త కలిసి పని చేశారు. శివ శక్తి దత్త కొడుకులు కూడా చిత్ర పరిశ్రమలోనే సెటిల్ అయ్యారు. కీరవాణి, కాంచి, కళ్యాణి మాలిక్ ఆయన కుమారులు. ఇక కీరవాణి ఇద్దరు కొడుకుల్లో ఒకరు కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్. సింహ చిన్న కుమారుడు కాగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు.
అయితే రాజమౌళికి మాత్రం కడుపున పుట్టిన వారసులు లేరు. ఆయన రమను ప్రేమ వివాహం చేసుకున్నారు. రమా రాజమౌళి కీరవాణి సొంత మరదలు. శ్రీవల్లికి తోడబుట్టిన చెల్లెలు. రమాకు మొదటి భర్తతో విడాకులు అయ్యాయి. కొడుకు కార్తికేయ మొదటి భర్త సంతానం. వదిన చెల్లెలితో రాజమౌళికి ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెళ్ళై కొడుకున్న రమను రాజమౌళి నిరాడంబరంగా వివాహం చేసుకున్నాడు. కార్తికేయను దత్తత తీసుకుని కన్న కొడుకుగా పెంచుకున్నాడు.
అలాగే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ పాప పేరు మయూఖ. ప్రస్తుతం టీనేజ్ లో ఉంది. రాజమౌళి సొంతగా పిల్లల్ని కనకపోవడానికి తన నిర్ణయమే కారణం అట. తనకంటూ పిల్లలు పుడితే కార్తికేయను నిర్లక్ష్యం చేస్తానేమో అనే ఓ సందేహం ఆయన్ని వెంటాడిందట. అందుకే రాజమౌళి పిల్లల్ని కనలేదట. రాజమౌళి వారసులను కోరుకోకపోవడానికి ఇదే కారణమట.

ఒక్కో సినిమాకు వందల కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకునే రాజమౌళి ఇంత నిస్వార్థంగా ఆలోచించడం గొప్ప విషయం. అలాగే రాజమౌళికి ఎలాంటి చెడు అలవాట్లు లేవట. ఆయన ఆల్కహాల్ కూడా తీసుకోరట. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారట. దానధర్మాలు చేసినా చాలా గోప్యంగా చేస్తారు. ఈ విషయంలో రాజమౌళి విమర్శల పాలయ్యారు. కరోనా సంక్షోభంలో అందరూ పెద్ద మొత్తంలో విరాళాలు ఇస్తుంటే రాజమౌళి మాత్రం తక్కువ ఇచ్చారు. అది కూడా ఆర్ ఆర్ ఆర్ నిర్మాత చేత ఇప్పించారని ప్రచారం జరిగింది.