Baba Re Release: అప్పట్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘నరసింహా’ వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత ‘బాబా’ అనే సినిమా చేసాడు..ఈ చిత్రానికి కథ మరియు నిర్మాత కూడా రజినీకాంతే..తనతో ‘బాషా’ వంటి చిత్రాన్ని తెరకెక్కించిన సురేష్ కృష్ణ ని తన డ్రీం ప్రాజెక్ట్ కి దర్శకుడిగా పెట్టుకున్నాడు..ఆరోజుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైంది..కానీ ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం విఫలమైంది..ఫలితంగా అప్పట్లో రజినీకాంత్ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది..కానీ రజినీకాంత్ మనసుకి ఈ చిత్రం ఎంతో దగ్గరైన సినిమా.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత నెటిజెన్స్ కూడా ఈ సినిమాని ఎంతో ఇష్టపడ్డారు..అందుకే అభిమానులకు ఈ సినిమాని రీ మాస్టర్ చేయించి రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చెయ్యాలనే ఆలోచన కలిగింది..ఆ ఆలోచన రజినీకాంత్ కి కూడా నచ్చింది..అప్పట్లో ఎడిటింగ్ లో తీసివేయ్యబడ్డ కొన్ని సన్నివేశాలను జతపర్చి డబ్బింగ్ కూడా చెప్పాడు రజినీకాంత్..అలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని నేడు ఘనంగా రీ రిలీజ్ చేసారు.
తమిళనాడు లో కొత్త చిత్రం ఎలా అయితే విడుదల అవుతుందో..అలా ‘బాబా’ సినిమాని రీ- రిలీజ్ చేసారు..కేవలం చెన్నై సిటీ లోనే వందకి పైగా షోస్ తో ఈ చిత్రం నేటి నుండి ప్రదర్శితం కాబోతుంది..అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి..ఓవర్సీస్ లో కూడా మంచి నంబర్స్ రాబోతున్నాయి..దీనినిబట్టీ చూస్తే ఈ సినిమాని నేటితరం ప్రేక్షకులు ఎంతలా ఇష్టపడ్డారో అర్థం చేసుకోవచ్చు.
అంతేకాకుండా కొత్త సన్నివేశాలు కూడా జతపర్చారు అని ప్రకటన రావడంతో ప్రేక్షకులు ఈ సినిమాని థియేటర్స్ లో చూడడానికి ఎగబడుతున్నారు..మరి ఈ చిత్రం ‘జల్సా’ మూవీ రికార్డుని బద్దలు కొడుతుందా లేదా అనేది చూడాలి..పవన్ కళ్యాణ్ నటించిన ‘జల్సా’ చిత్రాన్ని ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 1 వ తేదీన అభిమానులు స్పెషల్ షోస్ వేసుకున్నారు..స్పెషల్ షోస్ ద్వారా ఈ చిత్రానికి 3 కోట్ల 20 లక్షల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి..ఇది కేవలం టాలీవుడ్ రికార్డు మాత్రమే కాదు..ఆల్ టైం ఇండియన్ రికార్డ్..ఈ రికార్డుని ‘బాబా’ సినిమా బ్రేక్ చేస్తుందో లేదో చూడాలి..రీ రిలీజ్ కాబట్టి జల్సా రికార్డుని కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.