https://oktelugu.com/

Rajinikanth : ధనుష్‌ భార్యను చాలా బాగా చూసుకుంటాడు – రజినీకాంత్

      తమ విడాకుల అంశం పై ఇటు ధనుష్ గానీ, అటు  ఐశ్వర్య  గానీ ఎలాంటి క్లారిటీ  ఇవ్వలేదు. ఈ క్రమంలో ధనుష్‌-ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా  గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ధనుష్ గురించి మాట్లాడిన   ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.  కాలా సినిమా ఆడియో ఫంక్షన్‌లో ధనుష్‌ గురించి రజనీకాంత్‌ చాలా పాజిటివ్ గా మాట్లాడాడు.       ఇంతకీ రజని […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 20, 2022 / 08:42 PM IST

    Rajinikanth-Rama Prabha

    Follow us on

     

     

    Rajinikanth Assets

     
    తమ విడాకుల అంశం పై ఇటు ధనుష్ గానీ, అటు  ఐశ్వర్య  గానీ ఎలాంటి క్లారిటీ  ఇవ్వలేదు. ఈ క్రమంలో ధనుష్‌-ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా  గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ధనుష్ గురించి మాట్లాడిన   ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.  కాలా సినిమా ఆడియో ఫంక్షన్‌లో ధనుష్‌ గురించి రజనీకాంత్‌ చాలా పాజిటివ్ గా మాట్లాడాడు.  
     
     
    ఇంతకీ రజని ఏమి మాట్లాడాడో చూద్దాం.. ‘ధనుష్‌ చాలా మంచి పర్సన్.  తన  తల్లిదండ్రులను దేవుళ్లుగా భావించే వ్యక్తి.  ఇక భార్యను  చాలా బాగా  చూసుకుంటాడు.  అలాగే ధనుష్  మంచి తండ్రి కూడా. అదే విధంగా  మంచి అల్లుడు కూడా,  అన్నిటికి మించి ధనుష్  మంచి మనిషి,   గొప్ప ప్రతిభ కలిగిన నటుడు’   అంటూ రజినీకాంత్…  ధనుష్ గురించి చెప్పుకొచ్చాడు.  కాగా  ప్రస్తుతం ఈ  పాత వీడియో బాగా వైరల్ అవుతుంది. 
     
    ఇక తాజాగా  రజినీకాంత్ కూడా  వీరి విడాకుల  విషయంలో చాలా బాధ పడినట్లు తెలుస్తోంది.  ధనుష్‌తో ఐశ్వర్యకు 2004 నవంబర్‌ 18న వివాహం జరిగిన సంగతి తెలిసిందే.  అయితే,  ఈ మధ్య వీరి మధ్యలోకి  వేరే వ్యక్తులు వచ్చారని..  ధనుష్ వేరే హీరోయిన్ తో సన్నిహితంగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని  అందుకే అప్పటి నుంచి ఆమె  ధనుష్ కి దూరంగా ఉంటుందని తెలుస్తోంది. 

    http://twitter.com/PandiyanKpm/status/1483299980786167810?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1483299980786167810%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.sakshi.com%2Ftelugu-news%2Fmovies%2Fdhanush-aishwarya-divorce-rajinikanth-praising-dhanush-old-video-goes-viral