
Rajinikanth- NTR: మహానటుడు మరియు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు జన్మించి ఈ నెల 28 వ తారీఖు తో వంద సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా ఆయన శత జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరపబోతున్నారు. విజయవాడ లోని ఈ నెల 28 వ తారీఖున పోరంకి మండలం లో ఈ వేడుకలను నిర్వహించబోతున్నారు.
ఈ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలన్నీ నందమూరి బాలకృష్ణ స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. ఈ వేడుకలకు ప్రముఖ రాజకీయనాకులతో పాటుగా, టాలీవుడ్ సెలెబ్రిటీలు కూడా హాజరై, ఎన్టీఆర్ గొప్పతనం గురించి మాట్లాడబోతున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ వేడుకలకు తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ ని బాలయ్య బాబు ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు తెలుస్తుంది. రజినీకాంత్ మరియు ఎన్టీఆర్ కి మధ్య ఆరోజుల్లో ఎంతో మంచి సాన్నిహిత్యం ఉండేది.వీళ్లిద్దరు కలిసి అప్పట్లో ‘టైగర్’ అనే చిత్రం కూడా చేసారు.

ఎన్టీఆర్ గురించి ఎప్పుడు ప్రస్తవన వచ్చినా తనని తాను మర్చిపోయి ఎంతో గొప్పగా మాట్లాడుతాడు రజినీకాంత్.ఆయన అంటే గౌరవం ఉండడం వల్లే ఈ వేడుకలకు వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సూపర్ స్టార్ రజినీకాంత్ తెలుగు రాష్ట్రాల్లో, అది కూడా ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టి చాలా కాలమే అయ్యింది.అందుకే ఆయన స్వాగత మర్యాదలు కనీవినీ ఎరుగని రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు బాలయ్య.
ఈ నెల 28 వ తారీఖున మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ లోని హోటల్ నోవెటల్ కి చేరుకుంటాడు రజినీకాంత్.అనంతరం కాసేపు చంద్ర బాబు నాయుడు మరియు బాలయ్య తో భేటీ అవుతాడు, ఆ తర్వాత లంచ్ పూర్తి అయ్యాక విజయవాడ నుండి పోరంకి కి బయలుదేరుతాడు.అయితే ఈ వేడుకలకు జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా లేదా అనే విషయం ఇంకా బయటకి రాలేదు.