
Director Sukumar: టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్స్ ఎవరు అనే లిస్ట్ తీస్తే అందులో ముందు వరుసలో ఉంటాడు ‘సుకుమార్’. ఆర్య సినిమాతో ప్రారంభమైన ఇతని కెరీర్ ప్రస్తుతం ఏ స్థాయిలో ఉందొ ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా తో ఆయన పాన్ ఇండియన్ మార్కెట్ ని షేక్ చేసేసాడు. ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ ‘పుష్ప : ది రూల్’ ని తెరకెక్కిస్తూ బిజీ గా ఉంటున్నాడు.
పుష్ప పార్ట్ 1 కేవలం టీజర్ మాత్రమే అని, అసలు సినిమా ‘పుష్ప : ది రూల్’ అని, ఈ చిత్రం తో ఆయన ఈసారి పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఇది ఇలా ఉండగా సుకుమార్ గతం లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘అన్ స్టాపబుల్’ షో లో పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ షో లో ఆయన తన జీవితం లో చోటు చేసుకున్న ఎన్నో సంఘటనలను షేర్ చేసుకున్నాడు. తనకి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారని, పెద్దన్నయ్య బాలకృష్ణ ఫ్యాన్, మిగిలిన ఇద్దరు అన్నయ్యలు చిరంజీవి ఫ్యాన్స్. అందుకే మా ఇంట్లో అప్పట్లో ఒక సైడ్ మీ ఫోటో , ఇంకో సైడ్ చిరంజీవి ఫోటో ఉండేది అని బాలయ్య కి చెప్పుకొచ్చాడు సుకుమార్.అప్పట్లో ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికీ సుకుమార్ ఉంటున్న ఇంట్లో ఈ ఇద్దరి ఫొటోలే ఉంటాయట. చిన్నప్పటి నుండి ఆ ఫోటోలు ఎన్ని ఇల్లులు మారిన వదలలేదని సుకుమార్ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. అయితే ఈ ఇద్దరి హీరోలతో సుకుమార్ ఇప్పటి వరకు సినిమాలు చెయ్యలేదు. బాలయ్య తో చేస్తాడో లేదో ఇప్పుడే చెప్పలేం కానీ,చిరంజీవి తో మాత్రం భవిష్యత్తులో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉంది.