
NTR30 : ఎన్టీఆర్ 30 పూజా ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రారంభ కార్యక్రమానికి టాలీవుడ్ మొత్తం తరలి వచ్చింది. ఎన్టీఆర్ సన్నిహితుడు రాజమౌళి అందరికంటే ముందు అక్కడికి చేరుకున్నారు. ఎన్టీఆర్ తో మూవీ ప్రకటించిన కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సైతం హాజరయ్యారు. దిల్ రాజు, నాగవంశీ, నవీన్ ఎర్నేని, బివిఎస్ఎన్ ప్రసాద్ ఇంకా పలువురు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ ల మీద రాజమౌళి క్లాప్ కొట్టారు. ప్రశాంత్ నీల్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ ఇండియా వైడ్ న్యూస్ అయ్యింది. ఇదిలా ఉంటే ఈ ఈవెంట్లో జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ముంబై నుండి ఎన్టీఆర్ 30 ఈవెంట్ కోసం వచ్చారు. ఎన్టీఆర్-జాన్వీ కపూర్ మధ్య చక్కని సంభాషణ చోటు చేసుకుంది. సాధారణంగా సూపర్ హాట్ డ్రెస్సుల్లో దర్శనమిచ్చే జాన్వీ చీరలో పద్ధతిగా తయారయ్యారు. ఆమె సౌత్ ఇండియన్ అమ్మాయిని గుర్తు చేశారు.
కాగా ఈ ఈవెంట్లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాజమౌళి ఆమె ఆటోగ్రాఫ్ తీసుకున్నారట. ఆస్కార్ విన్నింగ్ డైరెక్టర్ ఏంటి, జాన్వీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఏంటనే సందేహం కలగవచ్చు. అయితే ఆ ఆటోగ్రాఫ్ తన కోసం కాదట. రాజమౌళి కుమార్తె మయూఖ ఆమె ఫ్యాన్ అట. ఎన్టీఆర్ 30 లాంచింగ్ ఈవెంట్ కి జాన్వీ కపూర్ వస్తున్నారని తెలిసి తండ్రికి ఒక బాధ్యత అప్పగించారట. మీరు జాన్వీని అడిగి నా కోసం ఆటోగ్రాఫ్ తేవాలని కోరారట. దాంతో జాన్వీతో కాసేపు ముచ్చటించిన రాజమౌళి ఆమె సంతకం తీసుకున్నారట.
తన కూతురు మయూఖ అరుదైన జ్ఞాపకంలా దాచుకునేలా ఒక పుస్తకంలో కొటేషన్ రాసి సంతకం పెట్టమన్నారట. జాన్వీ కపూర్ ఆటోగ్రాఫ్ రాజమౌళి తీసుకెళ్లి కూతురికి ఇవ్వనున్నాడట. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. ఇక రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనే ఆసక్తి కొనసాగుతుంది. రాజమౌళి ఏకంగా హాలీవుడ్ భామను దించుతున్నారనే ప్రచారం జరుగుతుంది.