https://oktelugu.com/

RRR Promotions: ఆర్ఆర్ఆర్ ప్రమోషన్.. డ్రెస్ కోడ్ తో తగ్గేదేలే అంటున్న రాజమౌళి, రాంచరణ్, ఎన్టీఆర్

RRR Promotions: ఆర్ఆర్ఆర్ మేనియాను మరోసారి పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ ఈ మేరకు ప్రమోషన్ మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తొలి ప్రమోషన్ ను రాజమౌళి తన ఇద్దరు హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో మొదలుపెట్టారు. అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లోగో ముద్రించిన డ్రెస్ లను వేసుకొని వీరు హైదరాబాద్ లో ప్రమోషన్ కు వచ్చారు. ఎన్టీఆర్ ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ లో కొంచెం సీరియస్ గానే కనిపిస్తుండగా.. రాంచరణ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : March 15, 2022 / 05:03 PM IST

    Tarak, Rajamouli, Charan

    Follow us on

    RRR Promotions: ఆర్ఆర్ఆర్ మేనియాను మరోసారి పతాక స్థాయికి తీసుకెళ్లేందుకు దర్శకధీరుడు రాజమౌళి రెడీ ఈ మేరకు ప్రమోషన్ మొదలుపెట్టారు. తాజాగా హైదరాబాద్ లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తొలి ప్రమోషన్ ను రాజమౌళి తన ఇద్దరు హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లతో మొదలుపెట్టారు. అదే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా లోగో ముద్రించిన డ్రెస్ లను వేసుకొని వీరు హైదరాబాద్ లో ప్రమోషన్ కు వచ్చారు. ఎన్టీఆర్ ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ లో కొంచెం సీరియస్ గానే కనిపిస్తుండగా.. రాంచరణ్ బ్లూ షర్ట్ లోపల నెక్ తో కొంచెం స్టైలిష్ అవతారంలోకి వచ్చాడు.

    Ramcharan, NTR with Rajamouli

    ఆర్ఆర్ఆర్ ఈనెల 25న రిలీజ్ అవుతోంది. ఈ ఇద్దరు అగ్రహీరోలతో రాజమౌళి మరోసారి హైదరాబాద్ లో ప్రమోషన్ షురూ చేశారు. ఈ క్రమంలోనే బాహుబలి కంటే కూడా ఆర్ఆర్ఆర్ సినిమా పెద్దది అంటూ రాజమౌళి సంచలన ప్రకటన చేశారు.

    Ram Charan, Jr NTR in RRR

    Also Read: Pawan Clarity On Alliance With TDP and BJP: ఏపీలో ‘విన్నింగ్’ కాంబినేషన్.. పాత ఫార్మూలానే గానీ.. ఏపీలో సక్సస్ ఫార్మూలా..!

    ఎన్టీఆర్ ఓ సూపర్ కంప్యూటర్ లాంటివాడు అని రాజమౌళి కితాబిచ్చాడు. ఇక షూటింగ్ టైమ్ లో చాలాసార్లు చరణ్ తన నటనతో తనను ఆశ్చర్యానికి గురిచేశాడని ప్రశంసించాడు.

    Danayya, NTR, Charan, Rajamouli

    తెలుగు సినిమా కొత్త దశకు చేరుకుంటోందని జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు. ఇకపై టాలీవుడ్ నుంచి మరిన్ని మల్టీ స్టారర్ లు సినిమాలు ఆశించవచ్చన్నాడు. చరణ్ లాంటి మిత్రుడు దొరకడం తన అదృష్టమని పేర్కొన్నాడు. ఇక తనకు బాబాయ్ బాలకృష్ణతోపాటు చిరంజీవి, మహేష్, ప్రభాస్, అల్లు అర్జున్ లతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేయాలని ఉందని ఎన్టీఆర్ తన మనసులోని మాటను బయటపెట్టాడు.

    Ram Charan, Tarak

    Also Read: Venkatesh Chanti Movie Child Artist: ‘చంటి’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా ?