
Natu Natu Song- Rajamouli: అంతర్జాతీయ స్థాయిలో రోజుకో అవార్డుని దక్కించుకుంటూ ఆస్కార్ అవార్డ్స్ కి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ క్యాటగిరీలో ‘నాటు నాటు’ సాంగ్ ద్వారా నామినేట్ అయిన #RRR , ఆస్కార్ అవార్డుని కూడా దక్కించుకుంటుందా లేదా అనేది మార్చి 12 వ తేదీన తెలియబోతుంది.ఈ పాటకి ఆస్కార్ అవార్డు అందుకునేందుకు అన్ని విధాలుగా అర్హత ఉంది.ఈ సాంగ్ కేవలం ఇండియా ని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది.
తెలుగు బాషా రాని వాళ్ళు కూడా ఈ పాట ని స్టెప్పులేస్తూ ఇంస్టాగ్రామ్ లో రీల్స్ పెట్టేస్తున్నారు.ఒక పాట కి ప్రపంచం మొత్తం ఊగిపోవడం అనేది ఇది వరకు ఎప్పుడూ జరగలేదు.ఈ సాంగ్ కి ఈ రేంజ్ రావడానికి కారణం హీరోలే.వాళ్ళు ఆ రేంజ్ లో పోటీ పడి చెయ్యకపొయ్యుంటే ఈ సాంగ్ కి ఇంత రీచ్ వచ్చేది కాదని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

కానీ రాజమౌళి దృష్టిలో మాత్రం ఈ సాంగ్ క్రెడిట్ హీరోలకు దక్కదట..ఆయన ఏమి మాట్లాడాడో ఒకసారి చూస్తే ‘నేడు ‘నాటు నాటు’ పాట కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలుగచేస్తుంది.ఈ పాట ఈ రేంజ్ కి రావడానికి కారణం ప్రేమ్ రక్షిత్ మాస్టర్..ఆయన కంపోజ్ చేసిన స్టెప్స్ వల్లే ఈ రోజు ఆ పాటకి ఇలాంటి రెస్పాన్స్ వచ్చింది..హీరోలు ఆ స్టెప్పులను తూచా తప్పకుండా వేసి పాటని మరోలెవెల్ కి తీసుకెళ్లారు.ఒస్కార్స్ లో నామినేషన్స్ దక్కడం మా అదృష్టం, కచ్చితంగా మేము ఆ అవార్డుని గెలుచుకుంటామని బలంగా నమ్ముతున్నాము’ అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి.మరి మార్చ్ 12 వ తేదీన లాస్ ఏంజిల్స్ లో జరగబొయ్యే ఆస్కార్ అవార్డ్స్ లో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కుతుందా లేదా అని అనేది చూడాలి.