Bigg Boss 6 Telugu- Raj: బిగ్ బాస్ సీజన్ 6 లో ఎలాంటి నెగటివిటీ తెచ్చుకోకుండా మంచి ఇమేజి తో బయటపడిన అతికొద్ది మంది కంటెస్టెంట్స్ లో ఒకరు రాజ్..హౌస్ లోకి వచ్చిన కొత్తల్లో అసలు మూడు వారాలైనా నెగ్గుకురాగలడా..ఇంత వీక్ కంటెస్టెంట్ ఏంటి అని ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు..కానీ వారాలు గడిచేకొద్దీ రాజ్ ఆటలో గొప్ప మార్పు కనిపించింది..మాస్కు తీసి తానూ నిజ జీవితం లో ఎలా అయితే ఉంటాడో అలాగే హౌస్ లో ఉన్నాడు..అందరితో కలిసిపోయి మంచోడిగా పేరు తెచ్చుకోవడమే కాదు..ఆటలో కూడా అద్భుతంగా రాణించాడు.

ఎంటర్టైన్మెంట్ టాస్కులలో కూడా అలరించాడు..ఆయన ఎలిమినేషన్ కూడా ప్రేక్షకుల వోటింగ్ ద్వారా జరగలేదు..బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయం వల్ల జరిగింది..మొత్తానికి ఈ వారం ఎలిమినేషన్ అనేది కేవలం ఫైమా వద్ద ఉన్న ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ వల్లే జరిగింది..ఈ ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ ని నీకు వాడుటను సేఫ్ అయ్యిపోమని రాజ్ ని ఫైమా ఎంత బ్రతిమిలాడినా రాజ్ ఒప్పుకోలేదు.
వేరే కంటెస్టెంట్ అయితే ఫైమా ఇచ్చిన ఆ అద్భుతమైన అవకాశం ని వాడుకొని ఇంట్లోనే ఉండేవారు..కానీ రాజ్ మాత్రం ఆ పని చెయ్యలేదు..అందుకే ఆయనకి సోషల్ మీడియా లో అంతటి సపోర్టు ఏర్పడింది..గత వారం లో కూడా ‘ఏవిక్షన్ ఫ్రీ పాస్’ గురించి ఆది రెడ్డి మరియు రాజ్ మధ్య చర్చ నడిచింది..ఈ వారం మన ఫ్రెండ్స్ బ్యాచి మొత్తం నామినేషన్స్ లో ఉన్నాం..ఏవిక్షన్ ఫ్రీ పాస్ ని ఎవరికీ వాడుతుందో ఫైమా..నీకు వాడుతుందేమో ఫైమా అని ఆది రెడ్డి రాజ్ తో అంటాడు.

కానీ రాజ్ నేను ఆ పాస్ ని తీసుకోను..ఆడియన్స్ వోటింగ్ ని బట్టే నడుచుకుంటాను..ఫైమా కస్టపడి ఆడి ఆ పాస్ ని గెలుచుకుంది..కాబట్టి ఆ పాస్ ఆమెకే దక్కాలి అని చెప్పాడు..అప్పుడు ఏదైతే మాట రాజ్ చెప్పాడో..నిన్న ఎలిమినేషన్ మీదకి వచ్చినప్పుడు కూడా అదే చెప్పాడు..ఇంత జెన్యూన్ గా వ్యవహరించిన కంటెస్టెంట్ బిగ్ బాస్ చరిత్రలో ఎవ్వరూ లేరంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి రాజ్ పై ప్రశంసల వర్షం కురుస్తుంది.