
Director Sukumar: బాహుబలి 2 సినిమా అంత పెద్ద సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి ఎన్నో అంశాలు కలిసొచ్చాయి. అందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది ‘వై కట్టప్ప కిల్లెద్ బాహుబలి’ అనే పాయింట్. బాహుబలి క్లైమాక్స్ లో ఆడియన్స్ మైండ్ బ్లాక్ చేసిన ట్విస్ట్ ఇది. ఈ ట్విస్ట్ మీదనే బాహుబలి పార్ట్ 2 పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
అదే విధంగా పుష్ప 2 మీద కూడా అంచనాలను క్రియేట్ చేసే పనిలో పడ్డాడు ఆ చిత్ర దర్శకుడు సుకుమార్.నేడు విడుదలైన ‘పుష్ప : ది రూల్’ ప్రీ టీజర్ లో ‘వేర్ ఈజ్ పుష్ప’ అనే పాయింట్ ని బాగా హైలైట్ చేసాడు. పుష్ప పార్ట్ 1 పుష్ప మరియు భన్వర్ సింగ్ షికావత్ మధ్య అదిరిపొయ్యే వార్నింగ్ సీన్ తో ముగుస్తుంది. భన్వర్ సింగ్ షికావత్ ని బట్టలు లేకుండా రోడ్డు మీద నడిపిస్తాడు పుష్ప.
ఆ తర్వాత ‘భన్వర్ సింగ్ షికావత్’ పగతో రగిలిపోతాడు, పుష్ప ని చావు దెబ్బ తియ్యాలని కసితో ఉంటాడు.పార్ట్ 2 స్టోరీ వీళ్లిద్దరి మధ్య రివెంజ్ అనే విషయం అందరికీ అర్థం అయిపోతుంది. అయితే ఆడియన్స్ లో ఆసక్తి ని కలగచేసేందుకు డైరెక్టర్ సుకుమార్ మరో పాయింట్ ని యాడ్ చేసాడు.పుష్ప సామ్రాజ్యం మొత్తాన్ని కూల్చి వేసి, జైలు లో తోస్తాడు భన్వర్ సింగ్ షికావత్.

పుష్ప శరీరం మీద బులెట్ గాయాలు కూడా ఉన్నట్టు చూపిస్తాడు ఈ ప్రీ టీజర్ లో.జైలు నుండి తప్పించుకున్న పుష్ప ఎవరికీ కనపడకుండా తన ఉనికి ని సీక్రెట్ గా ఉంచుకుంటాడు.ఆ తర్వాత ఏమి జరిగింది అనేది తెలియాలంటే ఏప్రిల్ 7 వ తారీఖున మెయిన్ టీజర్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.అచ్చు గుద్దినట్టు సుకుమార్ కూడా బాహుబలి కోసం రాజమౌళి వాడిన ఫార్ములానే వాడుతున్నాడు.మరి ఇది పుష్ప కి వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.