Pushpa Mania : ఒక టాలీవుడ్ హీరో.. పైగా ప్రభాస్ లాగా ప్యాన్ఇండియా స్టార్ కాదు.. కానీ మంచి మసాలా మాస్ కంటెంట్ తో వచ్చాడు. దాన్ని కరోనా కల్లోలం వేళ ప్యాన్ ఇండియాగా రిలీజ్ చేశారు. బాలీవుడ్ మూస సినిమాలు చూసి మొహం మొత్తిన హిందీ ప్రేక్షకులకు మన తెలుగోళ్లు కలిసి రూపొందించిన ‘పుష్ప’ తెగ నచ్చింది. సుకుమార్ డైలాగులకు అల్లు అర్జున్ యాక్షన్ కు హిందీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. అందుకే తెలుగులోకి మించి హిందీలో ‘పుష్ప’ ఆడుతోంది. థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
అల్లు అర్జున్ కు తెలుగుతోపాటు మలయాళంలోనూ మార్కెట్ ఉంది. ఇప్పుడు ఈ రెండుచిత్రసీమలకు మించి పెద్దదైన హిందీ పరిశ్రమలో బన్నీ యాక్షన్, నటన, పుష్ప పాటలకు జనాలు ఫిదా అయి తెగ చూసేస్తున్నారు. పుష్పలోని పాటలు, డైలాగులు ఇప్పుడు జనం వల్లెవేస్తూ తెగ వైరల్ చేస్తున్నారు. సెలబ్రెటీలు సైతం ‘తగ్గేదేలే ’అంటూ పుష్ప మేనియాను ఇనుడింపచేస్తున్నారు.
అల్లు అర్జున్ కు హిందీ జనాలు నీరాజనం పలుకుతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా పుష్ప మేనియానే బాలీవుడ్ లో ‘పుష్ప’ తన మార్క్ ను క్రియేట్ చేసింది. ‘పుష్ప’ సినిమాతో రికార్డ్ స్థాయిలో రూ.100 కోట్లు సాధించారు. ప్రభాస్ తర్వాత ఈ ఘనత అందుకున్న హీరోగా నిలిచారు.
నిజానికి అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాను అసలు మొదట హిందీలో రిలీజ్ చేయకూడదని నిర్ణయించారు.కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ముంబైకి వెళ్లి సుకుమార్, దేవీశ్రీలు రిలీజ్ కు కొద్దిరోజుల ముందు ఆగమేఘాల మీద ఈ సినిమాను రెడీ చేసి విడుదల చేశారు. అయితే ఎలాంటి పబ్లిసిటీ కూడా చేయకపోవడం వల్ల ఈ సినిమా ఎంత కలెక్షన్లు సాధిస్తుందోనన్న అనుమానం చిత్రం యూనిట్ ను వెంటాడింది.
కానీ ‘పుష్ప’ బాలీవుడ్ హిందీ చిత్రసీమను షేక్ చేశాడు. వాళ్ల అంచనాలను కూడా అందకుండా రికార్డ్ స్థాయిలో వసూళ్లు సొంతం చేసుకుంది. పుష్ప హిందీ వెర్షన్ ఆదివారంతో కలిసి దాదాపు రూ.100 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది.
ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోనూ అందుబాటులో ఉన్నప్పటికీ థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు ఇప్పటికీ వస్తూనే ఉండడం మరో విశేషంగా చెప్పొచ్చు.
ఒక సామాన్య కూలీ శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఎలా ఎదిగాడన్నది పుష్ప సినిమాలోని మెయిన్ పాయింట్. ఇదే సామాన్య ప్రేక్షకులకు తెగ నచ్చింది. హిందీ ప్రాంతాల్లో కర్షక, కార్మికులు ఎక్కువగా ఇది మాస్ జనాలను ఆకట్టుకుంది. అల్లు అర్జున్ డిఫెరెంట్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు.
ఇక పుష్ప సినిమాలోని ‘శ్రీవల్లి’ పాట, పుష్పరాజ్ డైలాగ్ అయితే ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు, బాలీవుడ్ సెలబ్రెటీలతోపాటు ఎంతో మంది ఈ రెండింటిని రీల్స్, టిక్ టాక్ వీడియోలు చేస్తూ సినిమాపై క్రేజ్ పెంచేశారు. అల్లు అర్జున్ నటనకు ఫిదా అయినట్లు జనాలు చెబుతున్నారు.
ఇక అల్లు అర్జున్ కెరీర్ లో హిందీలో తొలిసారి రూ.100 కోట్ల మార్క్ ను అందుకున్న మూవీగా నిలిచింది ‘పుష్ప’ ప్రభాస్ తర్వాత ఈ ఘనత సాధించిన తెలుగు హీరోగా అల్లు అర్జున్ ఈ రికార్డు సృష్టించారు. బాహుబలి, సాహోతో ప్రభాస్ 100 కోట్లు దాటగా.. ‘పుష్ప’తో బన్నీ ఈ ఘనత సాధించడం విశేషం.