Manish Shah: తెలుగు సినిమాలకు హిందీ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో ఫుల్ గిరాకీ ఉంది. అయితే, ఈ డిమాండ్ ను గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా చాలా ముందుగానే ఊహించాడు. ఏ హిందీ నిర్మాత తెలుగు సినిమాలను కొనకముందే.. గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా తెలుగు సినిమాలను కొని పెద్ద నిర్మాత అయిపోయాడు. ఈ క్రమంలో హిందీలో ‘పుష్ప’ రైట్స్ కొనుగోలు చేసి మనీష్ షా మంచి లాభాలను అందుకున్నాడు.

కాగా మనీష్ షా బాలీవుడ్ డైరెక్టర్లపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మనీష్ షా మాటల్లోనే.. ‘మా దర్శకులు అంధేరి-బాంద్రా మధ్యే ఉంటున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ చూస్తూ.. ఇండియా మొత్తం ఆ రెండు ప్రాంతాల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు. అందుకే వాళ్లు పుష్పలాంటి మంచి యాక్షన్ సినిమాలు చేస్తారని మీరు ఆశించకండి’ అని అన్నాడు. మొత్తానికి
బాలీవుడ్ డైరెక్టర్లపై పుష్ప హిందీ డబ్బింగ్ నిర్మాత ఈ రేంజ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Also Read: ఆ బడా న్యూస్ చానెల్ ను నిషేధించి మీడియాను దారికి తెచ్చిన కేంద్రం!
ఏది ఏమైనా పుష్పతో మంచి హిట్ అందుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. అసలు మనీష్ షా ఎంత ఎదిగాడు అంటే.. మొదట్లో తెలుగు హిట్ చిత్రాలను యూట్యూబ్‌లో డబ్బింగ్ చేసి రిలీజ్ చేసేవాడు. ఇప్పుడు నేరుగా థియేటర్లలో విడుదల చేసే స్థాయికి వచ్చాడు గోల్డ్‌మైన్స్ నిర్మాత మనీష్ షా.

కాగా పుష్ప దాదాపు రూ. 100 కోట్ల మార్కును చేరుకోగా, ఇకపై పలు తెలుగు పెద్ద హీరోల చిత్రాలను మనీష్షా వరుసగా థియేటర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట.
Also Read:‘RRR’ : ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సంతోషంలో ఫ్యాన్స్ !