Pushpa 2 Premiere Review: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో వచ్చిన పుష్ప 2 సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. అయితే ఈ సినిమా సంభందించిన ప్రీమియర్ షో స్ ఇంతకు ముందే అయిపోయిన నేపథ్యం లో ఈ సినిమాకి ఎలాంటి టాక్ వచ్చింది. అసలు ఈ సినిమా ఎలా ఉంది. అల్లు అర్జున్ తను అనుకున్న రేంజ్ లో సక్సెస్ అయ్యాడా లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఇక ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే పుష్ప రాజ్ గంధపు చెక్కల సిండికేట్ లో రారాజుగా వెలిగిపోతూ ఉంటాడు. సిస్టం మొత్తాన్ని తనే రూల్ చేసే స్థాయికి ఎదిగిన పుష్ప రాజ్ పెళ్ళాం చెప్పిన మాట వినే భర్త ఎలాంటి పనులు చేస్తాడో చేసి చూపించాడు. ఇక తనకు ఎదురొచ్చిన వారిని ఎలా ఢీకొట్టాడు అనే ఒక పాయింట్ తో సినిమా అయితే తెరకెక్కింది… ఇక సిస్టం మొత్తాన్ని రూల్ చేస్తున్న పుష్ప రాజ్ ను ఎవరు టార్గెట్ చేశారు. ఎందుకు అతన్ని అజ్ఞాతంలోకి పంపించే ప్రయత్నం చేశారు అనే విషయాల మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సుకుమార్ మొదటి పార్ట్ ని ఎక్కడైతే ఆపాడో ఈ సినిమాని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉండటం ఈ సినిమాకి చాలా వరకు కలిసి వచ్చిందనే చెప్పాలి. సుకుమార్ ఎక్కడ కూడా డివియేషన్స్ లేకుండా ఆయన అనుకున్న పాయింట్ ను స్ట్రెయిట్ గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తూ వచ్చాడు. ఇక ఆయన దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు చాలా వరకు ప్లస్ అయింది.
ముఖ్యంగా స్క్రీన్ ప్లే లో అతను వాడిన టెక్నిక్స్ ఈ సినిమాని కొంతవరకు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళయనే చెప్పాలి. పుష్ప రాజ్ అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ అనే ఒక డైలాగ్ ను జనాల్లోకి వదిలేసాడనే చెప్పాలి. ఇక సుకుమార్ ఈ సినిమాని మలిచిన విధానంతో డిఫరెంట్ వే లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది. ఇక మొదటి నుంచి చివరి వరకు ఎంగెజింగ్ గా సినిమాను తీసుకెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ప్రతి 15 నిమిషాలకు ఒకసారి సినిమాలో ఒక హై ఎలిమెంట్ అయితే ఇస్తూ వచ్చాడు. ముఖ్యంగా సుకుమార్ మార్క్ మేకింగ్ తో ఈ సినిమా చాలా వరకు ప్లస్ అయింది.
అయితే పుష్ప సినిమా సూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సుకుమార్ ఈ కథను రాసుకొని దానికి ట్రీట్ మెంట్ కూడా చాలా ఫ్రెష్ గా రాసుకున్నాడు. ఇక ఈ సినిమాలో కొన్ని ట్విస్టు లు కూడా వావ్ అనిపించేలా ఉండడం ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా నిలిచిందనే చెప్పాలి…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఈ సినిమాను అల్లు అర్జున్ తన షోల్డర్స్ మీద మోసుకొని వెళ్ళాడు. పుష్ప రాజ్ క్యారెక్టర్ లో పర్ఫెక్ట్ గా ఒదిగిపోవడమే కాకుండా ఈ సినిమా చూసే ప్రేక్షకుడికి ఒక హై మూమెంట్ అయితే ఇచ్చాడు. నిజానికి పుష్ప సినిమాలో చేసిన యాక్టింగ్ కంటే ఈ సినిమాలో అంతకుమించి అనేలా అల్లు అర్జున్ నటించి సగటు ప్రేక్షకుడిని మెప్పించే ప్రయత్నం చేశాడు. ఇక అల్లు అర్జున్ కనిపించిన ప్రతిసారి స్క్రీన్ మీద విలియతాండవం జరిగిందనే చెప్పాలి… అందుకే అల్లు అర్జున్ పుష్ప రాజ్ అనే ఒక క్యారెక్టర్ లో ఇమిడిపోయి తనను తాను సరెండర్ చేసుకొని నటించిన విధానమైతే నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ప్రతి ఒక్క ప్రేక్షకుడు అల్లు అర్జున్ ని చూడడం కంటే పుష్పరాజ్ అనే క్యారెక్టర్ తోనే ఎక్కువగా కనెక్ట్ అవుతారని చెప్పాలి.
అంటే అతను ఆ క్యారెక్టర్ లో అంతగా లీనమైపోయి పరకాయ ప్రవేశం చేశాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ పడ్డ కష్టం స్క్రీన్ మీద మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది… ఇక మిగతా ఆర్టిస్టులు అయిన సునీల్ మంగళ శీను క్యారెక్టర్ లో మరోసారి మెప్పించాడు. అలాగే భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫాహాద్ ఫజిల్ అద్భుతమైన నటన తీరును కనబరిచాడు. ఇక అక్కడక్కడ కామెడీ పంచులను కూడా పేలుస్తూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేశాడనే చెప్పాలి. ఇక పుష్పరాజు భార్య అయిన శ్రీవల్లి పాత్రలో కనిపించిన రష్మిక మందాన మరోసారి ది బెస్ట్ పర్ఫామెన్స్ ను అయితే ఇచ్చింది. ఇక ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాలన్నింటిలో ఆమెకు పెద్దగా పర్ఫామెన్స్ కి స్కోప్ అయితే లేదు. కానీ ఈ సినిమాలో మాత్రం ఆమెకు కూడా ఒక మంచి పర్ఫెక్ట్ పాత్రను డిజైన్ చేశారు…
టెక్నికల్ అంశాలు
ఇక ఈ సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే మ్యూజిక్ విషయంలో చాలా వరకు దేవి స్టి ప్రసాద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారనే చెప్పాలి. ఇక పాటలన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. స్క్రీన్ మీద పాటలు వచ్చిన సందర్భంలో ప్రేక్షకులందరూ లేచి విజిల్స్ వేస్తున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక శ్యామ్ సి ఎస్ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. ఇక కూబా సినిమాటోగ్రఫీ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయింది. విజువల్ గా అద్భుతంగా చూపించడం లో ఆయన సూపర్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి… ఇక ఎడిటర్ నవీన్ నూలీ కూడా పర్ఫెక్ట్ గా ఎడిట్ కట్ ఇచ్చి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు అయితే తీసుకొచ్చాడు…
ప్లస్ పాయింట్స్
అల్లు అర్జున్ యాక్టింగ్
గంగాలమ్మ జాతర
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్
స్టార్టింగ్ లో కొంచెం స్లో గా ఉంటుంది…