Pushpa 2 The Rule: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ ప్రీమియర్ షోస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తి అయ్యింది. రెస్పాన్స్ ఊహించిన దానికంటే పదింతలు ఎక్కువ వచ్చింది. ఇది ఇలా ఉండగా అల్లు అర్జున్ ఈ సినిమా ప్రీమియర్ షోని అభిమానుల సమక్షంలో చూసేందుకు ఆయన హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి కుటుంబ సమేతంగా విచ్చేశాడు. ఈ సమయం లో అల్లు అర్జున్ ని చూసేందుకు ఎగబడిన అభిమానులు కారణంగా కాస్త తొక్కిసిలాట ఏర్పడింది. ఈ ఘటన కారణంగా రేవతి అనే 39 ఏళ్ళ వయస్సు ఉన్న ఒక అమ్మాయి అక్కడికక్కడే స్ప్రుహ తప్ప పడిపోయింది. ఆమెతో పాటు తన ఇద్దరు కొడుకుల్ని కూడా సినిమాకి తీసుకొచ్చింది. ఒక అబ్బాయికి 9 ఏళ్ళ వయస్సు ఉంటుంది, మరో అబ్బాయికి 7 ఏళ్ళ వయస్సు ఉంటుంది. వీళ్లిద్దరికీ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి.
ఈ ఘటనపై ముందు ఒక పదేళ్ల కుర్రాడిపై పోలీసులు లాఠీ చార్జి చేసుకున్న కారణంగా అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. దీనిని చూసిన నెటిజెన్స్ హృదయాలు బరువెక్కిపోయాయి. చిన్న కుర్రాడు, ఇంకా ఈ ప్రపంచాన్ని సరిగా చూడను కూడా లేదు. తెలిసి తెలియని వయస్సులో, ఎదో తన అభిమాన హీరో సినిమా చూడడం కోసం వచ్చి ఇలాంటి దుర్ఘటన కి గురవ్వడం అత్యంత శోచనీయం. ప్రస్తుతం ఇది సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. తమ అభిమాన హీరో సినిమాని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. సినిమా గురించి మాట్లాడుకోవడం మానేసి సోషల్ మీడియా లో ఎక్కువ శాతం మంది అభిమానులు ఈ ఘటన గురించే మాట్లాడుకున్నారు. చనిపోయిన ఆ ఇద్దరి ఆత్మకు శాంతి చేకూరాలని, తీవ్రంగా గాయపడిన ఆ ఇద్దరు పిల్లలు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు.
ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాలు విడుదల సమయంలో మొదటి రోజు ఇలాంటి దుర్ఘటనలు చాలానే జరిగేవి. ఆ తర్వాత అనేక హీరోల సినిమాలకు వివిధ ప్రాంతాల్లో జరిగాయి కానీ, ఒకే థియేటర్ లో ఇద్దరు చనిపోవడం అనేది ‘పుష్ప 2’ థియేటర్ లోనే జరిగింది. చనిపోయిన మృతురాలు రేవతి దేహాన్ని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన గురించి అల్లు అర్జున్ ఇంకా స్పందించకపోవడంతో, ఆయనకీ ఈ విషయం గురించి ఇంకా సమాచారం చేరలేదని తెలిసింది. ఆయన వరకు విషయం వెళ్లిన తర్వాత కచ్చితంగా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడి, సహాయం చేస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. మరోపక్క ‘పుష్ప 2’ చిత్రానికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అల్లు అర్జున్ నట విశ్వరూపం ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్తుందని, థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా మరిచిపోలేమని అంటున్నారు. బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎంత వరకు ఉంటుందో చూడాలి.
Chaos prevails at the #SandhyaTheatre, at RTC ‘X’ Road, as fans of #AlluArjun were thronged at the Sandhya Theatre, during the Premiere show of Allu Arjun’s film #Pushpa2TheRule
Three people fell unconscious during the #stampede like situation, when they were… pic.twitter.com/LVUpP3vhOj
— Surya Reddy (@jsuryareddy) December 4, 2024