Pushpa 2 Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2 : ది రూల్’ నేడు తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్ షోస్ వేయగా దానికి సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. సినిమా ప్రారంభం నుండి ఎండింగ్ వరకు సుకుమార్ అల్లు అర్జున్ క్యారక్టర్ ని ఎలివేట్ చేసిన విధానం కి ఎన్ని దండాలు పెట్టినా తక్కువే. ఆ టేకింగ్ కి రోమాలు నిక్క పొడుచుకుంటాయి. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అయితే ప్రతీ పది నిమిషాలకు ఒక ఎలివేషన్ ని పెట్టాడు. డైరెక్టర్ రాజమౌళి ఒకానొక సందర్భం లో చెప్తాడు, సుకుమార్ మాస్ లోకి దిగితే మేమంతా సర్దుకోవాలి అని, ఆ డైలాగ్ ని ఈ చిత్రం నిజం చేసి చూపించింది. సుకుమార్ టేకింగ్ ఒక ఎత్తు అయితే, అల్లు అర్జున్ నటన మరో ఎత్తు. ప్రతీ సన్నివేశం లో ఆయన చూపించిన యాటిట్యూడ్ వేరే లెవెల్ లో ఉంది.
ముఖ్యంగా జాతర ఎపిసోడ్ లో అల్లు అర్జున్ నటన, డ్యాన్స్ కి ఆడియన్స్ కూడా పూనకాలొచ్చి ఊగిపోయే రేంజ్ లో ఉంది. ఈ సన్నివేశం ప్రభావాన్ని అంత తేలికగా మరచిపోలేము. థియేటర్స్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా అదే మూడ్ లో ఉండిపోతాము. ఈ ఒక్క సన్నివేశానికి అల్లు అర్జున్ కి మరో నేషనల్ అవార్డుని ఇచ్చేయొచ్చు. ఆ రేంజ్ లో నటించాడు. ఆ కసికి అతన్ని ద్వేషించే వాళ్ళు కూడా చేతులెత్తి దండం పెట్టాల్సిందే. ఇతని సినిమాని థియేటర్స్ లో చూడకూడదు అని ఫిక్స్ అయిన వాళ్ళు కూడా ఆపుకోలేరు. ఆ రేంజ్ లో ఉంటుంది ఆ సన్నివేశం. ఈ తరానికి అల్లు అర్జున్ ఒక మెగాస్టార్ అని ఫిక్స్ అయిపోవచ్చు. అదేమీ నటన, అదేమీ డ్యాన్స్ బాబోయ్!..జాతర ఎపిసోడ్ కి దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, సుకుమార్ టేకింగ్, అల్లు అర్జున్ విశ్వరూపం, దశాబ్దాలు చెప్పుకోవచ్చు.
సినిమా మొత్తం ఎలా ఉన్నా, ఈ జాతర ఎపిసోడ్ తర్వాత అదంతా బోనస్ గా అనిపిస్తుంది. ఈ ఎపిసోడ్ తోనే 2000 కోట్ల రూపాయిల గ్రాస్ ఫిక్స్ అయిపోయినట్టే. సెకండ్ హాఫ్ తర్వాత సినిమా గ్రాఫ్ కాస్త తగ్గినట్టు అనిపిస్తాది కానీ, ఆ జాతర ఎపిసోడ్ ప్రభావాన్ని మాత్రం మరచిపోలేము. బాలీవుడ్ ఆడియన్స్ అయితే వేరే లెవెల్ కలెక్షన్స్ ఇచ్చేస్తారు. కేవలం బాలీవుడ్ నుండే ఈ సినిమా వెయ్యి కోట్ల రూపాయిలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, మన ఊహాలకు కూడా అందని వసూళ్లు వస్తాయి. 2000 కోట్ల రూపాయిల గ్రాస్ కేవలం ఒక అంచనా మాత్రమే కానీ, ఇంకా ఎక్కువ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చూడాలి మరి ఈ సినిమా రేంజ్ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది అనేది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి 345 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు.