Puri Musings: దర్శకుడు పూరి జగన్నాధ్ కి విరామం దొరికితే మ్యూసింగ్స్ చేస్తూ ఉంటారు. లాక్ డౌన్ సమయంలో ప్రయోగాత్మకంగా మ్యూసింగ్స్ చేయడం స్టార్ట్ చేశారు. అవి బాగా సక్సెస్ అయ్యాయి. లోతైన ఫిలాసఫీని ఈ జనరేషన్ కి అర్థం అయ్యేలా చెప్పడం పూరి స్పెషాలిటీ. అందుకే జనాలు పూరి మ్యూసింగ్స్ కి బాగానే కనెక్ట్ అయ్యారు. లైగర్ మూవీ నిర్మాణంలో పడి పూరి మ్యూసింగ్స్ చేయడం ఆపేశాడు. ఇక లైగర్ విడుదలకు ముందే స్టార్ట్ చేసిన జనగణమన ఆగిపోవడంతో పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నాల్లో ఉన్నారు. పూరి దగ్గర బొచ్చెడు స్క్రిప్ట్స్ ఉంటాయి కాబట్టి, ఆయనకు ఒక హీరో కావాలి. కొత్త సినిమా స్టార్ట్ అయ్యే లోపు ఇలా కొన్ని ఆణిముత్యాలు మ్యూసింగ్స్ రూపంలో వదులుతున్నారు.

కాగా పూరి లేటెస్ట్ మ్యూసింగ్స్ లో యూత్ ని బాగా ఎట్రాక్ట్ చేసే లవ్ టాపిక్ ఎంచుకున్నాడు. ప్రేమ గురించి ఇప్పటికే చాలా మంది చెప్పారు. పూరి తనదైన స్టైల్ లో ప్రాక్టీకల్ ఎగ్జామ్పుల్స్ తో విశ్లేషించాడు. ప్రేమ అనేది ఒక డ్రగ్… ఆ డ్రగ్ లో ఉన్నప్పుడు ఎవరికీ ప్రామిస్ లు చేయవద్దు, నిర్ణయాలు తీసుకోవద్దని సూచించాడు. పూరి మ్యూసింగ్స్ లో మాట్లాడుతూ… డాక్టర్ హెలెన్ ఫిషర్ అనే మహిళ ప్రేమపై ప్రయోగాలు చేశారు. ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి పుస్తకాలు రాశారు.
2500 మంది యువ విద్యార్థుల మెదళ్ళు ఆమె స్కానింగ్ చేశారు. తమ లవర్ ని చూసినప్పుడు, ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు మెదడులో జరిగే మార్పులను రికార్డు చేశారు. మొత్తంగా ఆమె పరిశోధనలో తేలింది ఏమిటంటే… ప్రేమ దోమా ఏం లేవు. అంత కెమికల్స్ మాయ. ముద్దు పెట్టినప్పుడు మెదడులో డోపమైన్ విడుదలవుతుంది. అది విడుదలైనప్పుడు హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. దాంతో మరో ముద్దు పెట్టుకోవాలి అనిపిస్తుంది. నా బంగారాన్ని ముద్దాడితే ఎంతో హ్యాపీగా ఉంటుందని చెప్పేది, అందుకే.

లవ్ అనేది ఒక డ్రగ్. కాబట్టి ఆ డ్రగ్ లో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరికీ ప్రమాణాలు చేయకూడదు. రెండు సార్లు మాస్టర్బేషన్(స్వయం సంతృప్తి) చేసుకుంటే కెమికల్స్ చల్లబడతాయి. అప్పుడు మీ మెదడు సరిగా పని చేస్తుంది. పాతికేళ్ల తర్వాత కొంత బుద్ధి, జ్ఞానం వస్తాయి. అప్పటి వరకు కెమికల్స్ ప్రభావం మనమీద ఎక్కువగా ఉంటుంది. ఒక బ్లాక్ బస్టర్ లవ్ మూవీ చూసి లేచిపోవాలి, పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనలు వస్తాయి. కాబట్టి మెచ్యూరిటీ వచ్చే వరకు తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని, పూరి చెప్పుకొచ్చాడు.