Allu Arjun Wife Sneha Reddy: అల్లు అర్జున్ వైఫ్ స్నేహారెడ్డి అసలు తగ్గేదేలే అంటున్నారు. ఆమె సోషల్ మీడియా గ్లామర్ క్వీన్ గా అవతరిస్తున్నారు. తనలో దాగి ఉన్న అందాలన్నీ ఆవిష్కరిస్తున్నారు. స్నేహారెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల భార్యలు పక్కా పల్లెటూరి గృహిణులు మాదిరి ఇంటికే పరిమితం అయ్యేవారు. ఇల్లు, పిల్లలు, సంసారం తప్పితే పబ్లిక్ అటెన్షన్, ఒక గుర్తింపు కోరుకునేవారు కాదు. చాలా అరుదుగా హీరోల భార్యలు పబ్లిక్ లోకి వచ్చేవారు. రోజులు మారాయి. ఈ సోషల్ మీడియాలో యుగంలో ప్రతి ఒక్కరూ ఐడెంటిటీ కోరుకుంటున్నారు.తమకంటూ ప్రత్యేక ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు.

ఈ తరం స్టార్ హీరోల భార్యల్లో నమ్రత, స్నేహారెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. నమ్రత అంటే ఒకప్పటి హీరోయిన్. మిస్ ఇండియా కాబట్టి ఆమె ఫోటో షూట్స్ చేయడంలో వింతేమీ లేదు. స్నేహారెడ్డి గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం ఊహించని పరిణామం. స్నేహారెడ్డి గత రెండేళ్లుగా సోషల్ మీడియాలో మరింత చురుగ్గా ఉంటున్నారు. ఫ్యామిలీ ఫోటోలు, పిల్లలు, భర్త అల్లు అర్జున్ కి సంబంధించిన పోస్ట్స్ పెడుతూ ఉండేవారు. సడన్ గా ఆమె పంథా మార్చారు.
స్నేహారెడ్డి హీరోయిన్ రేంజ్ లో గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తున్నారు. ట్రెండీ వేర్స్, డిజైనర్ శారీలు ధరించి తనలోని గ్లామర్ ని పరిచయం చేస్తున్నారు. సహజంగానే స్నేహారెడ్డి హీరోయిన్ రేంజ్ గ్లామర్ కలిగి ఉంటారు. ఇక ప్రొఫెషనల్ ఫోటో షూట్స్ తో ఆమె స్టార్ హీరోయిన్స్ కూడా కుళ్ళుకునేలా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్నేహారెడ్డి ఇమేజ్ రోజు రోజుకూ పెరుగుతుంది. స్నేహారెడ్డిని ఇంస్టాగ్రామ్ లో 8 మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆమె ఇమేజ్ ఆ రేంజ్ లో ఉందో. తాజాగా రోజ్ పింక్ కలర్ డిజైనర్ శారీ ధరించి రాయల్ లుక్ లో దర్శనమిచ్చారు స్నేహారెడ్డి.

స్నేహారెడ్డి అందం చూస్తే ఆమె వివాహిత, ఇద్దరు పిల్లల తల్లని ఎవరూ అనుకోరు. స్నేహారెడ్డి లేటెస్ట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. స్నేహారెడ్డి సోషల్ మీడియా పోస్ట్స్ నేపథ్యంలో అనేక పుకార్లు తెరపైకి వస్తున్నాయి. ఇటీవల ఆమె ఒక స్టార్ హీరో మూవీతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. కీలక రోల్ కోసం ఆమెను సంప్రదించారని, స్నేహారెడ్డి అంగీకరించారంటూ వార్తలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత మేరకు నిజం ఉందో తెలియదు.