Pawan Kalyan- Puri Jagannadh: జనసేనాని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. ఈ దసరా నుంచి బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏపీ వ్యాప్తంగా పర్యటించి జనాల్లో పరపతి పెంచుకోవడానికి రెడీ అవుతున్నారు. జనసేనను క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఈ దసరాలోపు తను ఒప్పుకున్న క్రిష్ దర్శకత్వంలోని ‘హరిహర వీరమల్లు’ చిత్రంతోపాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘భవదీయుడు భగత్ సింగ్’ను పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు. పెండింగ్ సినిమాలన్నింటినీ దసరాలోపు పూర్తి చేసి దసరా తర్వాత పూర్తిస్థాయిలో ఏపీ రాజకీయాల్లోకి వెళ్లి అధికారమే లక్ష్యంగా అడుగులు వేయాలని యోచిస్తున్నారు.
Also Read: Sadha Nannu Nadipe Movie Review : ‘సదా నన్ను నడిపే’ మూవీ రివ్యూ
డ్యాషింగ్ దర్శకుడు పూరి జగన్నాథ్ తాజాగా పవన్ కళ్యాణ్ ను ఊహించుకొని ఒక పవర్ ఫుల్ కథ రాసినట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ‘లైగర్’ పూర్తి చేసిన పూరి.. ఇదే ఊపులో అతడితోనే ‘జనగణమన’ తీస్తున్నాడు. ప్యాన్ ఇండియా లెవల్ లో తీసే ఈ చిత్రాల తర్వాత పూరి ఏకంగా పవన్ కళ్యాణ్ ను బేస్ చేసుకొని ఏపీ రాజకీయాలను షేక్ చేసే కథను రూపొందించినట్టు సమాచారం.
పవన్ కళ్యాణ్ ను సీఎం చేసేందుకు పూరి జగన్నాథ్ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్టు తెలిసింది. ఏపీ రాజకీయాల్లో పోరాడుతున్న పవన్ అంతిమలక్ష్యం ‘సీఎం’ కావడం.. ఇప్పుడు పూరి కూడా ‘సీఎం పవన్ కళ్యాణ్’ కథ రాసుకున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం కావడానికి పడిన కష్టాలు, అడ్డంకులు అధిగమించి ఎలా తన కల నేరవేర్చుకున్నాడు? ఎలా జనరంజకంగా పాలించాడన్నది ఈ కథలో రాసుకున్నాడట.. ఏపీ రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలను పవన్ ఎదిరించేలా తీర్చిద్దాడట.. ఈ స్టోరీని పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర పూర్తి అయిన తర్వాత 2024 ఏపీ ఎన్నికల ముందు షూటింగ్ పూర్తి చేయాలని.. కేవలం 3 నెలలు మాత్రమే పవన్ ను సమయం కోరినట్లు తెలిసింది. మరి పూరి కథకు పవన్ ఓకే చెబుతారా? ఈ సినిమా తీస్తారా? అన్నది వేచిచూడాలి.
Also Read:RRR Nominated For Oscar Awards: ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అయిన RRR