Punjab Prisons: సమాజంలో వివిధ నేరాలకు పాల్పడిన వారిలో సత్ప్రవర్తన తీసుకొచ్చేందుకు కోర్టు జైల్లో వేస్తుంది. ఆయా కేసుల్లో నేర తీవ్రత ఆధారంగా వారికి జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో ఖైదీలు శిక్ష పొందుతున్నప్పుడు పెరోల్ ద్వారా వారి కుటుంబ సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తుంది. ఇక మన దేశంలో రాజకీయ ఖైదీలకు ఉండే సౌలభ్యాలే వేరు. పేరుకు జైలు అయినప్పటికీ.. పడుకునేందుకు డబుల్ కాట్ బెడ్, మాట్లాడుకునేందుకు ఫోన్, చూసేందుకు టీవీ, చదివేందుకు న్యూస్ పేపర్లు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్.. ఇలాంటి సౌకర్యాలను జైలు అధికారులు బాగానే కల్పిస్తారు. అప్పట్లో పరిటాల రవి హత్య కేసులో ప్రమేయం ఉన్నట్టు జైలు శిక్ష అనుభవించిన మద్దెల చెరువు సూరి వంటి వారైతే జైల్లోనే ఫోన్ వాడినట్టు సమాచారం. ఈ విషయం తెలిసిందేమో త్రివిక్రమ్ శ్రీనివాస్ జల్సా సినిమాలో ముకేష్ రుషి కి జైల్లో శిక్ష అనుభవిస్తున్నా అందులో నుంచే సెటిల్మెంట్లు చేస్తున్నట్టు చూపిస్తాడు. ప్రేక్షకులకు ఇంకా ఆసక్తి కలిగించేందుకు “మీరు చూస్తున్నది జైలే. వీళ్ళు అన్నీ పంచాయతీలు, సెటిల్మెంట్లు జైల్లోనే చేస్తారు. మీకు అంత అనుమానం ఉంటే రోజు పేపర్ చదవండి. టీవీలో న్యూస్ చూడండి” అంటూ మహేష్ బాబు తో చెప్పించాడు. ఇక నీరవ్ మోది, విజయ్ మాల్యా, చోక్సీ ఇలాంటి వారైతే దేశం విడిచిపెట్టే వెళ్తారు అది వేరే విషయం.

పంజాబ్ జైళ్ళ శాఖ ఆలోచన మామూలుగా లేదు
పంజాబ్ తెలుసు కదా! పాకిస్తాన్ కు దగ్గరగా ఉంటుంది. డ్రగ్స్, ఆయుధాలు, ఇంకా మన్నూ మశానం ఆ రాష్ట్రంలో ఎక్కువే. సాక్షాత్తూ అక్కడి రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తాగి ఫ్లైట్లో పడబోతుంటే సిబ్బంది బలవంతంగా దించేశారు. ఒక ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే.. ఇక అక్కడి పౌరులు మాత్రం ఎలా ఉంటారు.. మొన్నామధ్య అక్కడి పాప్ సింగర్ హత్యకు జైలు నుంచే రెక్కీ నిర్వహించారు. పోలీసులు విచారణ చేస్తే ఈ ఘటనలో సూత్రధారులు, పాత్రధారులు ఎవరో తెలిసింది. వారిని పట్టుకునే క్రమంలో నిందితులు కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఫైరింగ్ మొదలుపెట్టడంతో అందులో ఇద్దరు చచ్చారు.
Also Read: KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్.. కేసీఆర్ నిర్ణయం నిరుద్యోగులకు శాపం!

శాంతిభద్రతల విషయంలో పంజాబ్ ఎప్పుడూ సమస్యాత్మక ప్రాంతమే. ఇలాంటి రాష్ట్రంలో అక్కడి జైళ్ళ శాఖ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు తమ జీవిత భాగస్వామితో జైల్లోనే ఏకాంతంగా గడిపే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు గత మంగళవారం నుంచి పంజాబ్లోని మూడు జైళ్ళల్లో జీవిత భాగస్వాముల సందర్శన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గోవింద్ వాల్ సాహిబ్ కేంద్ర కారాగారం, నాభా జిల్లా జైలు, బాటిండా మహిళా జైల్లో దీని లాంఛనంగా ప్రారంభించారు. అయితే తీవ్ర నేరాలకు పాల్పడినవారు, గ్యాంగ్స్టర్లు, లైంగిక నేరాల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు ఈ అవకాశం ఉండదు. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలు మాత్రం మూడు నెలలకు ఒకసారి మాత్రం రెండు గంటలపాటు జీవిత భాగస్వామితో గడపొచ్చు. ఇందుకోసం అటాచ్డ్ బాత్ రూం ఉన్న గదిని కేటాయించారు. దీర్ఘకాలికంగా శిక్ష అనుభవిస్తున్న వారికి తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు.
Also Read:Munugodu By Election: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి అతనే..
[…] […]