
Priyanka Chopra Daughter Malti Marie: ప్రియాంక చోప్రా సుప్రసిద్ధ భారతీయ నటి.. అమెరికాలోనూ సినిమాలు చేస్తున్న నటి.. తనకంటే పది సంవత్సరాలు చిన్నవాడైన నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న నటి.. ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో అనేక విజయవంతమైన సినిమాల్లో ఆమె నటించింది. ప్రత్యేకమైన పేరుని కూడా సంపాదించుకుంది. 2000 సంవత్సరంలో ప్రపంచ సుందరి కిరీటం కూడా దక్కించుకుంది.. అలాంటి ఈ నటి ప్రస్తుతం బాలీవుడ్ లో అడపాదడపా సినిమాలు చేస్తోంది. తన భర్త నిక్ జోనాస్ తో కలిసి అమెరికాలో ఉంటున్నది.
ప్రియాంక చోప్రా కేవలం నటి మాత్రమే కాదు. సమాజ సేవలో కూడా ముందుంటుంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగించే ప్రపంచ ఆరోగ్య సంస్థ తరఫున ఆఫ్రికా ఖండంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నది అక్కడి మహిళలకు చదువు ప్రాధాన్యాన్ని వివరించే కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తుంది. కౌమార దశలోని ఆడపిల్లలకు వ్యక్తిగత ఆరోగ్యం పై సలహాలు కూడా ఇచ్చే బాధ్యతను కూడా భుజం పైకి ఎత్తుకుంది. ఇందుకు గానూ ప్రియాంక చోప్రా పలు పురస్కారాలు కూడా అందుకుంది.
ఇక సోషల్ మీడియాలో ప్రియాంక చోప్రా అభిమానులకు టచ్ లో ఎప్పటికప్పుడు ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంది. తన భర్తతో కలిసి ప్రపంచంలోని పలు దేశాలను తిరిగివస్తుంది. అక్కడ వింతలు, విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. అంతే కాదు మహిళ సాధికారతకు సంబంధించి ఓపెన్ గానే మాట్లాడుతుంది. తాను ఈ స్థాయికి చేరేందుకు ఎన్నో కష్టాలు పడ్డానని చెప్పే ప్రియాంక.. బాలీవుడ్లో తనకు అవకాశాలు ఇచ్చేందుకు మొదట్లో చాలామంది అడ్డుకున్నారని తన ఆవేదనను వ్యక్తం చేసింది. అంతేకాదు తన బ్రేకప్ లవ్ స్టోరీ లను కూడా ఎటువంటి మొహమాటం లేకుండా చెప్పేస్తూ ఉంటుంది. ఇది తన భర్తకు కూడా తెలుసంటుంది.

అయితే నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత.. ప్రియాంక చోప్రా వయసురీత్యా గర్భం దాల్చడం దాదాపు అసాధ్యమని డాక్టర్లు చెప్పారు. దీంతో ఆమె అండాన్ని, జోనాస్ వీర్యం ద్వారా కలిపి.. వైద్యులు ఆమెను సరో గెట్ మదర్ చేసేశారు. ఫలితంగా ప్రియాంక చోప్రా ఒక ఆడపిల్లకు తల్లయింది. అయితే ఇన్నాళ్లు ఆ ఆడపిల్ల ముఖాన్ని ప్రపంచానికి ప్రియాంక చోప్రా చూపించలేదు. నెటిజన్లు పలుమార్లు అడిగినప్పటికీ ప్రియాంక చోప్రా తిరస్కరించుకుంటూ వచ్చింది. అయితే చివరికి తానే ఆ సస్పెన్షన్ కు తెర దించింది. ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో తన కూతురితో కలిసి పూజలు చేస్తున్న ఫోటోలు ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై అభిమానులు రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. పాప చాలా అందంగా ఉందని, అచ్చం ఆమె తండ్రి లాగానే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు.. అయితే దీనికి స్పందించిన ప్రియాంక చోప్రా.. మీ అందరి దీవెనలు నా కూతురుపై ఉండాలని కోరుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
View this post on Instagram