Akkineni Akhil : తెలుగు చలన చిత్ర పరిశ్రమకి రెండు కళ్లు లాంటివారిలో ఒకరు అక్కినేని నాగేశ్వర రావు.. తెలుగు సినిమా ప్రారంభం అయ్యిందే అక్కినేని ఫామిలీ తో.. అలా దశాబ్దాలుగా ఇండస్ట్రీ ని ఏలిన నాగేశ్వర రావు వారసత్వాన్ని ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున మరో లెవెల్ కి తీసుకెళ్లి సుమారు నాలుగు దశాబ్దాల పాటుగా టాప్ 4 హీరోస్ లో ఒకరిగా కొనసాగాడు..కానీ ఆయన వారసత్వాన్ని కొడుకులిద్దరూ అదే స్థాయిలో కొనసాగించలేకపొయ్యారు.

భారీ అంచనాలతో ఇండస్ట్రీ కి లాంచ్ అయినా అక్కినేని నాగచైతన్య మరియు అక్కినేని అఖిల్ స్టార్ హీరోలు అవ్వలేకపోయారు..నాగ చైతన్య కి భారీ హిట్స్ ఉన్నప్పటికీ కూడా స్టార్ స్టేటస్ రాలేదు..ఇక అఖిల్ స్టార్ స్టేటస్ రప్పించుకోగలిగే కెపాసిటీ ఉన్నా కూడా సరైన బ్లాక్ బస్టర్ హిట్స్ లేకపోవడంతో ఆయన కూడా స్టార్ హీరో కాలేకపోయాడు..ఇప్పుడు అక్కినేని అభిమానుల ఎదురు చూపులు మొత్తం ఏజెంట్ పైనే ఉన్నాయి..ఈ సినిమా పెద్ద హిట్ అయితే అఖిల్ స్టార్ లీగ్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి.
అఖిల్ సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఒక షార్ట్ ఫిలిం లో నటించాడట..ఈ షార్ట్ ఫిలిం లో హీరోయిన్ గా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల హీరోయిన్ గా నటించిందట..ఈ విషయాన్నీ స్వయంగా నిహారిక తెలిపింది..అయితే షార్ట్ ఫిలిం దరిద్రంగా రావడం తో యూట్యూబ్ లో విడుదల చేయలేదట..ఆమె ఎప్పుడైతే ఈ విషయం చెప్పిందో అప్పటి నుండి ఆమెకి సోషల్ మీడియా లో అభిమానుల తాకిడి ఎక్కువైపోయింది..చెత్త షార్ట్ ఫిలిం అని మీరు చెప్పడం కాదని.. మేము చూసి నిర్ణయిస్తామని..దయచేసి ఆ షార్ట్ ఫిలిం ని యూట్యూబ్ లో విడుదల చెయ్యండి, మిలియన్ల కొద్దీ వ్యూస్ తప్పకుండా వస్తాయి అని అభిమానులు అడుగుతున్నారట.
మరి నిహారిక ఆ షార్ట్ ఫిలింని అప్లోడ్ చేస్తుందో లేదో చూడాలి..నిహారిక ప్రస్తుతం పెళ్లి చేసుకొని నటనకి దూరంగా ఉంటూ వెబ్ సిరీస్ లను నిర్మిస్తోంది. వీటికి మంచి ఆదరణ దక్కింది కూడా..అంతే కాకుండా స్వయంగా ఈమెకి యూట్యూబ్ చానెల్స్ కూడా ఉన్నాయి.. ఆ చానెల్స్ లో ఈ షార్ట్ ఫిలిం ని అప్లోడ్ చేయాల్సిందిగా అభిమానులు కోరుకుంటున్నారు.