Telangana History: బయటపడ్డ 10వేల ఏళ్ల నాటి తెలంగాణ చారిత్రక వైభవం.. వైరల్ ఫొటోలు

Telangana History:  తెలంగాణ ఘన చరిత్ర బయటపడింది. ఇక్కడ నేలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న సంస్కృతి సంప్రదాయాలు వెలుగుచూశాయి. ఈ చారిత్రక ఆనవాళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడి వైభవాన్ని చాటిచెప్పాయి. ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ (కేటీసీబీ)కి చెందిన చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల బృందం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాసిపేట సమీపంలోని ఒక చిన్న కొండపై మధ్య శిలాయుగం నాటి పురాతన రాక్ ఆర్ట్ సైట్ ను కనుగొన్నారు. కనీసం 10 […]

Written By: NARESH, Updated On : May 14, 2022 3:41 pm
Follow us on

Telangana History:  తెలంగాణ ఘన చరిత్ర బయటపడింది. ఇక్కడ నేలలో ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఉన్న సంస్కృతి సంప్రదాయాలు వెలుగుచూశాయి. ఈ చారిత్రక ఆనవాళ్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇక్కడి వైభవాన్ని చాటిచెప్పాయి. ‘కొత్త తెలంగాణ చరిత్ర బృందం’ (కేటీసీబీ)కి చెందిన చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల బృందం తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని కాసిపేట సమీపంలోని ఒక చిన్న కొండపై మధ్య శిలాయుగం నాటి పురాతన రాక్ ఆర్ట్ సైట్ ను కనుగొన్నారు.

Telangana History

కనీసం 10 వేల ఏళ్ల నుంచి 30 వేల ఏళ్ల మధ్య నాటివిగా చెబుతున్న రాతి కళా సంపద బయటపడింది. ఈ రాతి కళలో నాలుగు బైసన్ లు, రెండు మానవ బొమ్మలు ఉన్నాయి. గుర్రాన్ని పోలిన జంతువును ఈ బృందం సభ్యులు కనుగొన్నారు.

దాదాపు 30 అడుగుల పొడవైన కొండపై లోపలి వైపున అనేక రెడ్ ఓచర్ కలర్ పెయింటింగ్ లను ఈ బృందం గుర్తించింది. అయితే స్థానికులు పూజలు చేసే క్రమంలో సున్నం పూత పూయడంతో పలు పెయింటింగ్స్ మాసిపోయాయి. నాలుగు బైసన్ ల వెనుక నిలబడి ఉన్న మావన బొమ్మ నమూనాను ఉపయోగించి గీశారు. రేగొండ సైట్ లో ఆయుధం ఉన్న వ్యక్తి శిలాఫలకం మాదిరిగానే మరో మానవ బొమ్మ ఇక్కడ ఉండడం విశేషం.

Also Read: Ram Gopal Varma : నా లైఫ్‌ నా ఇష్టం.. నాలా బతకాలంటే ఆ మూడు వదిలేయాలి: రామ్‌గోపాల్‌వర్మ!!

ఈ బృందం కొండ దిగువన అరుదైన మైక్రోలిత్ లను కూడా కనుగొన్నారు. చుట్టుపక్కల కొన్ని చారిత్రక శిలాజాలను గుర్తించారు. ఆయుధంతో మానవ బొమ్మ పెయింటింగ్ 10 వేల ఏళ్ల నాటి చారిత్రాక కాలానిది కావచ్చని బృందం సభ్యులు తెలిపారు.

దీంతో తెలంగాణలో 10 వేల ఏళ్ల నుంచి 30 వేల ఏళ్ల మధ్యలో మధ్య శిలాయుగంలో నాగరికత వెల్లివిరిసిందని ఈ ఆధారాల ద్వారా బయటపడ్డాయి. భారతదేశంలో ఇంతటి క్రీస్తు పూర్వం వేల ఏళ్ల నాటి చారిత్రక ఆనవాళ్లు బయటపడడం ఇదే తొలిసారి. అందుకే జాతీయ మీడియాలో సైతం తెలంగాణ చారిత్రక వైభవంపై కథనాలు వెలువడ్డాయి.

Also Read: Sarkaru Vaari Paata 3 Days Collections: ‘ సర్కారు వారి పాట’ 3 డేస్ కలెక్షన్లు.. ఇబ్బంది పడుతున్న మహేష్