
Pawan’s heroine: పోకిరి చిత్ర రీమేక్ తో వెండితెరకు పరిచయమైంది ప్రణీత సుభాష్. ఏం పిల్లో ఏం పిల్లడో చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. అనంతరం సిద్ధార్థ్ కి జంటగా బావ చిత్రం చేశారు. విలేజ్ లవ్ డ్రామాగా తెరకెక్కిన బావ మూవీ పెద్దగా ఆడలేదు. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాలేదు. కన్నడ, తమిళ భాషల్లో చిత్రాలు చేశారు. కొంచెం గ్యాప్ ఇచ్చి అత్తారింటికి దారేది చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది.

దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన అత్తారింటికి దారేది ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సమంతతో పాటు ప్రణీత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జతకట్టారు. అత్తారింటికి దారేది మూవీలో ప్రణీత సెకండ్ హీరోయిన్. సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రకు అంత స్క్రీన్ స్పేస్ ఉండదు. అత్తారింటికి దారేది చిత్రంలో మాత్రం ప్రణీతకు ప్రాధాన్యత ఉన్న పాత్ర దక్కింది. ఆమెపై రెండు సాంగ్స్ కూడా తెరకెక్కించారు.
View this post on Instagram
అత్తారింటికి దారేది మూవీతో బ్రేక్ వచ్చినప్పటికీ, ప్రణీత నిలబెట్టుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే ఆమెకు లక్ కలిసి రాలేదు. ఎన్టీఆర్ తో ఛాన్స్ వచ్చినా ఫలితం దక్కలేదు. రభస మూవీలో సమంత, ప్రణీత మరోసారి హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీ ప్లాప్ కావడంతో ప్రణీత కెరీర్ పై ప్రతికూల ప్రభావం పడింది.
మంచు విష్ణుతో చేసిన డైనమైట్, మహేష్ కి జంటగా నటించిన బ్రహ్మోత్సవం వరుస పరాజయాలయ్యాయి. ఆ దెబ్బతో టాలీవుడ్ నుండి చెక్కేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పరిశ్రమలో మనుగడ కేవలం సక్సెస్ మీద ఆధారపడి ఉంటుంది. అందం, టాలెంట్ తో సంబంధం లేకుండా హిట్ హీరోయిన్స్ వెనుక మేకర్స్ పడతారు. ఆ సమీకరణాలలో ప్రణీతకు ఛాన్సులు రావడం తగ్గిపోయాయి.
చివరిగా తెలుగులో ఎన్టీఆర్ కథానాయకుడు మూవీలో చిన్న గెస్ట్ రోల్ చేశారు. తెలుగులో ఆమె కెరీర్ దాదాపు ముగిసింది. 2021లో బిజినెస్ మాన్ నితిన్ రాజును ప్రణీత రహస్య వివాహం చేసుకున్నారు. పెళ్ళైన కొద్దిరోజులకు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. గత ఏడాది ఓ పాపకు జన్మనిచ్చారు. అయితే ఆమె గ్లామర్ షోలో అసలు తగ్గడం లేదు. పొట్టి బట్టల్లో స్కిన్ షో చేస్తుంది. తాజాగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా టాప్ ధరించి, క్లీవేజ్ షోతో రచ్చ చేసింది. ప్రణీత హాట్ ఫోటోలు ప్రకంపనలు రేపుతున్నాయి.
View this post on Instagram