https://oktelugu.com/

కేజీఎఫ్ దర్శకుడితో ప్రభాస్.. త్వరలో సెట్స్ పైకి? 

దర్శక దిగ్గజం రాజమౌళి-డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ‘ఛత్రపతి’.. ‘బాహుబలి’.. ‘బాహుబలి-2’ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు. ‘బాహుబలి’ సిరీసుల తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం ప్రభాస్ కు బాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం […]

Written By:
  • NARESH
  • , Updated On : November 30, 2020 / 08:01 PM IST
    Follow us on

    దర్శక దిగ్గజం రాజమౌళి-డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మూవీలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ‘ఛత్రపతి’.. ‘బాహుబలి’.. ‘బాహుబలి-2’ సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాయి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వరుసగా ప్యాన్ ఇండియా మూవీలు చేస్తూ తన క్రేజ్ ను మరింత పెంచుకుంటున్నాడు.

    ‘బాహుబలి’ సిరీసుల తర్వాత వచ్చిన ‘సాహో’ సైతం ప్రభాస్ కు బాలీవుడ్లో యాక్షన్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. ప్రభాస్ ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ మూవీ చేస్తున్నాడు. ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన బుట్టబొమ్మ పూజాహెగ్డే నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది.

    ఈ మూవీ తర్వాత ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ తో ‘ఆదిపురుష్’.. దర్శకుడు నాగ్ అశ్విన్ తో ఓ సైంటిఫిక్ మూవీ చేయబోతున్నట్లు అధికారిక ప్రకటనలు వచ్చాయి. ఈ సినిమాలు సైట్స్ పైకి వెళ్లకుండానే మరో క్రేజీ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఫిక్స్ అయిందని సమాచారం. ‘ఆదిపురుష్’ కంటే ముందుగా ఈ మూవీ సెట్స్ పైకి వెళుతుందనే టాక్ విన్పిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రకటన మరో రెండ్రోజుల్లో వెలువడనుందని సమాచారం. కన్నడలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘ఉగ్రమ్’ మూవీనే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో తెరకెక్కించబోతున్నాడట.

    కన్నడలో ప్రశాంత్ నీల్ దర్శకుడిగా తెరకెక్కించిన తొలి సినిమా ఉగ్రమ్.. ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్టుగా నిలువడంతోపాటు పలు అవార్డులను తీసుకొచ్చింది. ఈ కథలో కొన్ని మార్పులు చేసి ప్రభాస్ తో ప్యాన్ ఇండియా మూవీగా దర్శకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని సమాచారం.