Unstoppable 2 balakrishna prabhas : అన్ స్టాపబుల్ షో మరో క్రేజీ ఎపిసోడ్ కి సిద్ధమైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ని బాలయ్య హోస్ట్ చేయనున్నాడు. బాలయ్య-ప్రభాస్ ఎపిసోడ్ తో టీఆర్పీ బాక్సులు బద్దలు కావడం ఖాయమనిపిస్తుంది. ప్రభాస్ చాలా రిజర్వుడుగా ఉంటారు. ఆయన ఇలాంటి టాక్ షోలలో పాల్గొనడం చాలా అరుదు. తన మూవీ విడుదల సమయంలో ప్రమోషన్స్ లో కనబడతాడు. మళ్ళీ కొత్త సినిమా విడుదలయ్యే వరకు ఆయన దర్శనం ఉండదు. అందుకే ప్రభాస్ గెస్ట్ గా రానున్న అన్ స్టాపబుల్ షో చాలా ప్రత్యేకం కానుంది.

అందులోనూ అన్ స్టాపబుల్ షో బోల్డ్నెస్ కి పెట్టింది పేరు. గెస్ట్ లైఫ్ లో ఉన్న కాంట్రవర్సీ, పుకార్లు, అపోహలు, అనుమానాలు… అన్నీ బాలయ్య తెరపైకి తెస్తాడు. గెస్ట్ ని అడిగి క్లారిటీ తీసుకుంటాడు. ఈ క్రమంలో ప్రభాస్ గురించి అభిమానులు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఆయన వివాహం సంగతి. 43 ఏళ్ల ప్రభాస్ ఇంకా వివాహం చేసుకోలేదు. దీని గురించి చర్చకు రావడం ఖాయం.
అలాగే అనుష్క శెట్టి, కృతి సనన్ లతో లవ్ ఎఫైర్స్, పెళ్లి పుకార్లలను ఉద్దేశించి బాలకృష్ణ ప్రభాస్ ని అడుగుతాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అనేక ఆసక్తికర అంశాల సమాహారంగా ప్రభాస్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ సాగనుంది. దీనికి సంబంధించిన ప్రోమో ఆల్రెడీ విడుదల చేశారు. ప్రభాస్, బాలకృష్ణల ఫెరోషియస్ లుక్స్, సీన్స్ కాంబినేషన్ గా ప్రోమో అదిరిపోయింది. అయితే అన్ స్టాపబుల్ షోలో ప్రభాస్ పాల్గొన్న లుక్ రివీల్ చేయలేదు.
అయితే ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించిన ఒక వీడియో లీకైంది. ఆ వీడియోలో ప్రభాస్ లుక్ చూసిన ఫ్యాన్స్ మెస్మరైజ్ అవుతున్నారు. ఎల్లో కలర్ కాంబినేషన్ కలిగిన చెక్స్ షర్ట్ లో గడ్డం పెంచుకొని ప్రభాస్ మాస్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ లీక్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ప్రభాస్ తో పాటు ఈ ఎపిసోడ్లో గోపీచంద్ పాల్గొననున్నారని సమాచారం. పరిశ్రమలో ప్రభాస్-గోపీచంద్ మంచి మిత్రులు. ప్రభాస్ ఫస్ట్ కమర్షియల్ హిట్ వర్షం చిత్రంలో గోపీచంద్ విలన్ రోల్ చేశారు.
https://www.youtube.com/watch?v=YF6SOdOl95I