Prabhas Kriti Sanon : కృతి సనన్ తో ప్రభాస్ ఎంగేజ్మెంట్?… ప్రేమకు బీజం పడింది అక్కడే!

Prabhas Kriti Sanon : ప్రభాస్ తో కృతి సనన్ లవ్ ఎఫైర్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. కొద్దిరోజుల క్రితం ఊహాగానంగా మొదలైన ఈ వార్త సీరియస్ టర్న్ తీసుకుంది. వరుస పరిణామాలు, ప్రముఖుల కామెంట్స్ వారి రిలేషన్ నిజమన్న వాదన బలపరుస్తున్నాయి. కృతి సనన్ వ్యాఖ్యలతో రూమర్ స్టార్ట్ అయ్యింది. కృతి ప్రభాస్ పట్ల తన ప్రేమను ఓపెన్ గా మీడియా ముందు వ్యక్తపరిచారు. ఆయన ఒప్పుకుంటే పెళ్ళికి నేను రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. […]

Written By: NARESH, Updated On : November 29, 2022 7:27 pm
Follow us on

Prabhas Kriti Sanon : ప్రభాస్ తో కృతి సనన్ లవ్ ఎఫైర్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్. కొద్దిరోజుల క్రితం ఊహాగానంగా మొదలైన ఈ వార్త సీరియస్ టర్న్ తీసుకుంది. వరుస పరిణామాలు, ప్రముఖుల కామెంట్స్ వారి రిలేషన్ నిజమన్న వాదన బలపరుస్తున్నాయి. కృతి సనన్ వ్యాఖ్యలతో రూమర్ స్టార్ట్ అయ్యింది. కృతి ప్రభాస్ పట్ల తన ప్రేమను ఓపెన్ గా మీడియా ముందు వ్యక్తపరిచారు. ఆయన ఒప్పుకుంటే పెళ్ళికి నేను రెడీ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు… ఇద్దరి మధ్య ఎలాంటి అనుబంధం లేకుండానే కృతి ఈ కామెంట్ చేశారా? అనే వాదన తెరపైకి వచ్చింది.

 

 

అనంతరం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. కృతి సనన్-వరుణ్ ధావన్ జంటగా నటించిన తోడేలు(భేడియా) చిత్రం నవంబర్ 25న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కృతి, వరుణ్ ఓ హిందీ రియాలిటీ షోలో పాల్గొన్నారు. ఈ షోలో వరుణ్ నోరు జారారు. మాటల్లో మాటగా… కృతి సనన్ పేరు ఒక వ్యక్తి గుండెల్లో ఉంది. ఆయన ముంబైలో లేరు. వేరే చోట దీపికా పదుకొనెతో షూటింగ్ చేస్తున్నారని చెప్పారు. ఇక్కడ వరుణ్ చెప్పిన వ్యక్తి ప్రభాస్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రాజెక్ట్ కె మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుండగా హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతుంది.

తాజాగా ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు సంచలన ట్వీట్ చేశారు. ప్రభాస్-కృతి సనన్ రిలేషన్ లో ఉన్నారు. ఆదిపురుష్ సెట్స్ లో ప్రభాస్ ఆమెకు లవ్ ప్రపోజ్ చేశాడు. ప్రభాస్ లవ్ ప్రపోజల్ హ్యాపీగా అంగీకరించిన కృతి రిలేషన్ కి నాంది పలికారు. త్వరలో వీరికి ఎంగేజ్మెంట్. అనంతరం పెళ్లి… అని ట్విట్టర్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన ట్వీట్ వైరల్ అవుతుంది. ఈ పరిణామాలతో ప్రభాస్-కృతి ఎఫైర్ కథనాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నిజం ఏదైనా అధికారిక ప్రకటన వస్తే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు. సస్పెన్సు కి తెరదించాలని ఆశపడుతున్నారు.

చాలా కాలంగా ప్రభాస్, అనుష్క ప్రేమించుకున్నారనే వాదన ఉంది. వారు పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారని కథనాలు వెలువడ్డాయి. ఆ రూమర్స్ కొంచెం సద్దుమణిగిన తరుణంలో కృతి సనన్ ని ప్రభాస్ ప్రేమిస్తున్నట్లు ప్రధానంగా వినిపిస్తుంది. మరోవైపు సంక్రాంతికి విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా పడింది. ఆదిపురుష్ మరింత ఆలస్యం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్-కృతిసనన్ ప్రస్తుతం ఆదిపురుష్ మూవీలో కలిసి నటించారు. రాముడిగా ప్రభాస్, సీతగా కృతిసనన్ నటించింది. ఆ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని.. ఆదిపురుష్ యే వీరిని కలిపిందని అంటున్నారు. ఇన్నాల్లు ఎవరికీ పడని ప్రభాస్ ఇప్పుడు కృతి ప్రేమలో పడ్డాడని అంటున్నారు. మరి ఈ వార్తలు నిజమా? కాదా? అన్నది వేచిచూడాలి.