
Agent Pre Release Event: అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ‘ఏజెంట్’ సినిమా ఈ నెల 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రం కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఉన్నారు.ఎందుకంటే అఖిల్ కచ్చితంగా స్టార్ హీరో అవుతాడు అనే అంచనాలతోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు.ఇతర హీరోల అభిమానులు కూడా అదే అనుకున్నారు.కానీ ఆయన ఇండస్ట్రీ లోకి వచ్చి 8 ఏళ్ళు అవుతుంది.
స్టార్ హీరో అయ్యే సంగతి కాసేపు పక్కన పెడితే, ఇప్పటి వరకు కెరీర్ లో ఆయనకీ సరైన బ్లాక్ బస్టర్ హిట్ తగలలేదు.ఈ 8 ఏళ్లలో అఖిల్ అన్నయ్య నాగ చైతన్య 6 సార్లు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.స్టార్ హీరో అయ్యేందుకు అన్నీ విధాలుగా అర్హత ఉన్న అఖిల్ ఇప్పటి వరకు భారీ హిట్ కొట్టకపోవడం అనేది అక్కినేని అభిమానులు అవమానం గా ఫీల్ అవుతున్నారు.అందుకే వాళ్ళ ఆశలన్నీ ఇప్పుడు ‘ఏజెంట్’ చిత్రం పైనే ఉన్నాయి.
అయితే ఏజెంట్ చిత్రం కచ్చితంగా అఖిల్ కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ఫ్యాన్స్.ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్ కి రెస్పాన్స్ అదిరిపోయింది.ఇది ఇలా ఉండగా త్వరలో నిర్వహించబోయ్యే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాబోతున్నాడు అట.దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే చేయనుంది మూవీ టీం.ఇటీవలే మూవీ టీం ప్రభాస్ ని సంప్రదించగా, ఆయన డేట్స్ చూసుకొని చెప్తానని చెప్పాడట.

డేట్స్ సర్దుబాటు అవ్వడం తో కచ్చితంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ప్రభాస్ రాకతో ఏజెంట్ మూవీ రేంజ్ మరింత పెరిగింది అని చెప్పొచ్చు.మొదటి రోజు ఈ చిత్రానికి బంపర్ ఓపెనింగ్స్ వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.టాక్ వస్తే వంద కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టి స్టార్ హీరో లీగ్ లోకి అడుగుపెట్టాలని చూస్తున్నాడు అక్కినేని అఖిల్.