Homeఆంధ్రప్రదేశ్‌Posani- Balakrishna: జగన్ పై సైకో వ్యాఖ్యలు.. బాలకృష్ణకు పోసాని స్ట్రాంగ్ కౌంటర్

Posani- Balakrishna: జగన్ పై సైకో వ్యాఖ్యలు.. బాలకృష్ణకు పోసాని స్ట్రాంగ్ కౌంటర్

Posani- Balakrishna
Posani- Balakrishna

Posani- Balakrishna: రాష్ట్రంలో సైకో పాలన సాగుతోంది అని విమర్శించిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై… అంతే స్థాయిలో స్పందించారు ప్రముఖ నటుడు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి. ఇంట్లో కాల్పులు జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా.. సినిమా షూటింగ్ కు బాలకృష్ణ ఎలా వెళ్ళగలిగారో అందరికీ తెలుసు అంటూ పోసాని చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి విభిన్నమైన శైలితో ఉంటారు. ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అమితంగా ఇష్టపడే ఆయన.. సీఎంపై ఎవరు విమర్శలు చేసినా క్షమించరు. తనదైన శైలిలో వారిపై విమర్శలు చేస్తూ ఉంటారు. శుక్రవారం తన అల్లుడు లోకేశ్ చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. సీఎం జగన్మోహన్ రెడ్డి పైన, ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలపై పోసాని కృష్ణ మురళి ఘాటుగానే స్పందించారు. ఈ రాష్ట్రంలో సైకో ఎవరన్న విషయం అందరికీ తెలుసని ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి.. బాలకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించడం ఆసక్తిని కలిగిస్తుంది.

ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు..

గడిచిన ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పోసాని కృష్ణ మురళి పనిచేశారు. జగన్ తో కలిసి అనేక చోట్ల పాదయాత్రలో కూడా పాల్గొన్నారు. వీలు కుదిరినప్పుడల్లా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి నాటి సీఎం చంద్రబాబు నాయుడు, ఆ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. 2019 ఎన్నికలకు కొద్ది రోజులు ముందు వరకు మీడియా సమావేశాలను ఏర్పాటు చేసి వైసీపీకి మద్దతు ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మద్దతును ఆయన ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా కొద్ది రోజులు కిందట వైసిపి ప్రభుత్వం ఆయనకు ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని అప్పగించింది. కొద్దిరోజుల కిందట ఆయన సినీ ప్రముఖులు సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు.

కాల్పులు ఎవరు చేస్తారో బాలకృష్ణకే తెలియాలి..

రాష్ట్రంలో సైకో ప్రభుత్వం పాలన చేస్తోంది అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలపై.. పోసాని తీవ్రంగా స్పందించారు. కొన్నాళ్ల కిందట బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయని.. ఈ కాల్పులు ఎవరు చేశారో బాలకృష్ణ చెప్పాలని పేర్కొన్నారు. బాలకృష్ణ ఇద్దరిని గన్ తో కాల్చివేసి.. పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా తరువాత రోజు మేకప్ వేసుకొని షూటింగ్ కి ఎలా వెళ్లాడో చెప్పాలని డిమాండ్ చేశారు. మంచి వాళ్ళు ఎవరైనా ఇలా కాల్చివేస్తారా..? అని ఆయన ప్రశ్నించారు. సదరు వ్యక్తులతో బాలకృష్ణకు సమస్య ఉంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, గన్ ఉంది కదా అని కాల్చివేస్తారా..? అని ప్రశ్నించారు. ఇద్దరు వ్యక్తులపై కాల్పులు చేసిన తర్వాత బాలకృష్ణ ఏమైనా జైలుకు వెళ్లాడా అంటే అదీ లేదని, ఇది ఎలా సాధ్యమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. పోసాని కృష్ణమురళి ఇలాగే చేస్తే నాలుగు తన్ని బొక్కలో వేస్తారని, మరి బాలకృష్ణకు ఎందుకు అలా జరగలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

Posani- Balakrishna
Posani- Balakrishna

ఎవరు సైకో ప్రజలకు అర్థమవుతోంది..

కొద్ది నెలల కిందట ఆడది కనిపిస్తే కడుపు చేయాలి అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని, ఇటువంటి అడ్డగోలు వ్యాఖ్యలు ఎన్నో చేశారని బాలకృష్ణ గురించి పోసాని కృష్ణ మురళి పేర్కొన్నారు. ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడే బాలకృష్ణ సైకో నా, అందరినీ గౌరవించే జగన్మోహన్ రెడ్డి సైకో నా అన్న విషయం ప్రజలు తేల్చుకుంటారన్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, ప్రజల మేలు కోసం పనిచేస్తున్న ఆయనకు ఓట్లు వేసి గెలిపిస్తారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజల గుండెల్లో లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యాడన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని అకారణంగా జైల్లో పెట్టారని, ప్రతిపక్షాలన్నీ కుట్రలు పన్నుతున్నాయని ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళీ విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular