Pooja Hegde: పూజా హెగ్డే లేటెస్ట్ మూవీ సర్కస్. డిసెంబర్ 23న గ్రాండ్ గా విడుదల కానుంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించారు. పీరియాడిక్ కామెడీ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కింది. సర్కస్ మూవీలో రణ్వీర్ సింగ్ ఎలక్ట్రిక్ మాన్ గా సరికొత్త రోల్ చేస్తున్నారు. ఈ చిత్ర ట్రైలర్ నిన్న విడుదల చేశారు. ట్రైలర్ ఈవెంట్ లో పూజా హెగ్డే అందరి మనసులు దోచేశారు. నిజంగా చెప్పాలంటే బాగా డిస్టర్బ్ చేశారు. రెడ్ శారీ, స్లీవ్ లెస్ జాకెట్ లో సూపర్ సెక్సీ లుక్ లో చంపేశారు.

పబ్లిక్ లో పూజా లుక్ టూ మచ్ హాట్ గా ఉంది. పూజా హెగ్డే హాట్ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఆమె ఫ్యాన్స్ మైండ్ బ్లోయింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక క్రిస్మస్ కానుకగా విడుదలవుతున్న సర్కస్ ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి. కాగా పూజా గత మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య ఆమెకు షాక్ ఇచ్చాయి. ఈ క్రమంలో సాలిడ్ హిట్ తో గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలి అనుకుంటుంది.

సర్కస్ మూవీ విజయం ఆమెకు చాలా కీలకం కూడా. ఒకప్పుడు లక్కీ హీరోయిన్ ట్యాగ్ తో వరుస హిట్స్ ఇచ్చిన పూజా హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసింది. కాగా తెలుగులో పూజా చేస్తున్న వన్ అండ్ ఓన్లీ ప్రాజెక్ట్ SSMB 28. ఇటీవల రెగ్యులర్ షూట్ మొదలైంది. త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. మహేష్ కి జంటగా పూజా రెండోసారి నటిస్తున్నారు. ఇక త్రివిక్రమ్ తో ఆమెకు మూడో చిత్రం. పూజాకు లైఫ్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్.

మహేష్ మూవీ విజయం సాధిస్తే మరలా ఆమెకు టాలీవుడ్ లో అవకాశాలు క్యూ కట్టవచ్చు. జనగణమన మధ్యలో ఆగిపోవడంతో పూజా మంచి ఆఫర్ కోల్పోయారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా దాదాపు రూ. 4 కోట్ల రెమ్యూనరేషన్ నష్టపోయింది. ఇక పవన్ కళ్యాణ్ భవదీయుడు భగత్ సింగ్ డిలే కావడం కూడా ఆమెను దెబ్బేసింది. సకాలంలో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కి ఉంటే పవర్ స్టార్ పక్కన నటించే ఛాన్స్ పూజాకు దక్కేది. కాగా సల్మాన్ కి జంటగా చేస్తున్న కిసీకా భాయ్ కిసీకి జాన్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. రంజాన్ కానుకగా ఇది విడుదల కానుంది.