Pooja Hegde: స్టార్ హీరోయిన్ గా ఫుల్ ఫార్మ్ లో ఉన్న పూజా హెగ్డేపై ఎఫైర్ రూమర్స్ గుప్పుమన్నాయి. ఆమె ఏజ్ బార్ స్టార్ హీరో ప్రేమలో పడ్డట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒక ఫిల్మ్ క్రిటిక్ ట్వీట్ తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రెండేళ్లుగా పూజా కెరీర్ పీక్స్ లో ఉంది. ఆమె వరుసగా స్టార్ హీరోల చిత్రాలకు సైన్ చేస్తుంది. ఒక దశలో పూజా వరుస హిట్స్ ఇచ్చారు. అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. ఇలా పూజా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను నమోదు చేశాయి.

అయితే ఈ ఏడాది విడుదలైన రాధే శ్యామ్, ఆచార్య, బీస్ట్ నిరాశపరిచాయి.అయినా ఆమెకు ఆఫర్స్ జోరు తగ్గలేదు. ప్రస్తుతం మహేష్ కి జంటగా SSMB 28 చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ఈ నెలలో తిరిగి ప్రారంభం కానుంది. ఇక పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడట. మహేష్ ఫస్ట్ పాన్ ఇండియా చిత్రంగా విడుదలయ్యే సూచనలు కలవంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హిందీలో పూజా మరో రెండు భారీ చిత్రాలు చేస్తున్నారు. రణ్వీర్ సింగ్ కి జంటగా సర్కస్ మూవీ చేస్తున్నారు. సర్కస్ చిత్రం డిసెంబర్ 23న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఇటీవల చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. పీరియాడిక్ కామెడీ, రొమాంటిక్ డ్రామాగా దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించారు. అలాగే సల్మాన్ కి జంటగా ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ చిత్రంలో పూజా హెగ్డే నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది రంజాన్ కానుకగా విడుదల కానుంది.

అయితే పూజా హేగ్డ్-సల్మాన్ ఖాన్ మధ్య ఎఫైర్ మొదలైంది అంటున్నారు. ఈ సీనియర్ స్టార్ హీరో పూజా ప్రేమలో మునిగి తేలుతున్నాడట. వీరిద్దరూ రహస్యంగా చక్కర్లు కొడుతున్నారట. సల్మాన్ ఖాన్ నిర్మాణంలో పూజా మరో రెండు చిత్రాలు కూడా సైన్ చేశారట. వివాదాస్పద ఫిల్మ్ క్రిటిక్ ఉమర్ సంధు ఈ మేరకు ట్వీట్ చేశారు. 56 ఏళ్ల సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ప్రేమాయణం నడుపుతున్నారన్న కథనాలు సంచలనంగా మారాయి. మరి ఉమర్ సంధు ట్వీట్లో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది. గతంలో సల్మాన్ సంగీత బిజ్లానీ, ఐశ్వర్య రాయ్, కత్రినా కైఫ్ తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్ తో ఎఫైర్ నడిపారు.