Pawan Kalyan Sujeeth Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులకు మాములు కిక్ ఇవ్వడం లేడు..ఒక పక్క పొలిటికల్ కార్యకలాపాలతో జనాలకు చేరువ అవుతూనే, మరోపక్క క్రేజీ కాంబినేషన్స్ తో సినిమాల మీద సినిమాలు ప్రకటించేస్తున్నాడు..రీసెంట్ గా అభిమానులకు ఒక రేంజ్ పూనకాలు రప్పించేలా చేసిన ప్రకటన పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ మూవీ..#RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత డీవీవీ దానయ్య నిర్మించబోతున్న ప్రాజెక్ట్ ఇది..కేవలం ఒక చిన్న కాన్సెప్ట్ పోస్టర్ తో ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించగా అభిమానులు నుండి సెలెబ్రిటీల వరుకు ప్రతీ ఒక్కరు ఎంతో ఆనందించారు.

ఈ సినిమా భారీ యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కించబోతున్నట్టు సమాచారం..సుమారుగా 175 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఈ సినిమా కోసం పెట్టబోతున్నాడట డీవీవీ దానయ్య..పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రాన్ని భారీ తారాగణం తో తెరకెక్కించబోతున్న..ఫిబ్రవరి నుండి షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి..అన్నీ సరిగా కుదిరితే వచ్చే ఏడాది దసరా కానుకగా విడుదల కూడా అయిపోతుంది.
అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ని పెట్టాలంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ట్విట్టర్ లో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ని ట్యాగ్ చేసి నిన్న నేషనల్ లెవెల్ లో ఒక భారీ ట్రెండ్ ని చేసారు..సౌత్ ఇండియా లో ప్రస్తుతం అనిరుధ్ మేనియా ఒక రేంజ్ లో కొనసాగుతుంది..ఆయన రీసెంట్ గా అందించిన ఆల్బమ్స్ అన్ని చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి..ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సినిమాని వేరే లెవెల్ కి తీసుకెళ్ళిపోతాది అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.

ఇక పవన్ కళ్యాణ్ – సుజీత్ కాంబినేషన్ లో తెరకెక్కబోయ్యే ప్రాజెక్ట్ యాక్షన్ జానర్ కాబట్టి, ఇలాంటి సబ్జక్ట్స్ కి అనిరుధ్ మాత్రమే న్యాయం చేయగలడని..మాకు అనిరుధ్ మాత్రమే కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు..అప్పుడు డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సమాధానం ఇస్తూ ‘ఇప్పుడు కదా ప్రాజెక్ట్ ని ప్రకటించాము..కాస్త ఓపిక పట్టండి..అన్నీ ఒక్కొక్కటిగా చెప్తాము’ అని అన్నాడు..ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.