Pooja Hegde: సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ సినిమా ఇది..ఈ సినిమాకి ముందు వీళ్ళ కాంబినేషన్ లో అతడు మరియు ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి..ఈ రెండు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు కానీ, విడుదలైన కొద్ది సంవత్సరాల తర్వాత టీవీ టెలికాస్ట్ లో మాత్రం ప్రేక్షకుల నుండి అద్భుతమైన ఆదరణ దక్కించున్నాయి.

అందుకే ఈ కాంబినేషన్ అంటే అందరికీ అంత ఇష్టం..ఎప్పుడెప్పుడు మళ్ళీ ఈ కాంబినేషన్ సెట్స్ మీదకి వెళ్తుందా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ కి వీళ్ళ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది అనే న్యూస్ రావడం వాళ్లకి మామూలు కిక్ ఇవ్వలేదు..అయితే వీళ్ళ కాంబినేషన్ లో సినిమా అయితే ప్రకటించారు కానీ..ఇప్పటి వరకు రెగ్యులర్ షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు.
మొదట యాక్షన్ ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నారు..స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది..కానీ ఎందుకో మహేష్ కి ఆ స్క్రిప్ట్ పై నమ్మకం లేక సరికొత్త కథతో మళ్ళీ నా దగ్గరకి రమ్మని త్రివిక్రమ్ కి చెప్పాడట..అప్పుడు త్రివిక్రమ్ ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సబ్జెక్టు తో మహేష్ బాబు ఆకర్షించాడు..అంతే వెంటనే త్రివిక్రమ్ కి డేట్స్ ఇచ్చేసాడు..అయితే ఈ సినిమాకి సంబంధించిన కాస్టింగ్ విషయం లో మొదటి నుండి కాస్త కన్ఫ్యూజన్ ఉంది..ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే ని తీసుకున్నారు..ఆమె ఈ సినిమా కోసం డేట్స్ కూడా భారీ స్థాయిలోనే ఇచ్చింది.

కానీ ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ఏమిటంటే ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..బాలీవుడ్ లో ఆమెకి క్రేజీ ఆఫర్స్ రావడం తో పాటు, మహేష్ – త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియని పరిస్థితి కాబట్టి ఆమె ఈ సినిమా నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో చూడాలి.