Pooja Hegde Health: టాలీవుడ్ లో నంబర్ 1 హీరోయిన్ గా చెలామణి అవుతోంది పూజా హెగ్డే. దాదాపు తెలుగు స్టార్ హీరోలందరితోనూ ఆమె నటించింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఆస్థాన హీరోయిన్ గానూ ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. ఇక ఈ మధ్యన రాధేశ్యామ్ సహా సల్మాన్ ఖాన్ మూవీ ఇలా పలు హిందీ సినిమాల్లోనూ నటిస్తూ పాపులర్ అవుతోంది.

అయితే ఏమైంది ఏమో కానీ.. తాజాగా పూజా హెగ్డే నడవలేని స్థితిలో ఉన్న ఫొటోను షేర్ చేసింది. బెడ్ కే పరిమితమైంది. కాలు సోఫాపై పెట్టి బెడ్ పై పడుకొని ఉన్న షాకింగ్ ఫొటోను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘కాలుకు పట్టి కట్టుకున్న ఫొటోను షేర్ చేస్తూ లిగ్మెంట్ టియర్ అయ్యిందని తెలిపింది. ఈ గాయం ఎలా అయ్యిందన్నది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.దీంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
ప్రస్తుతం పూజా హెగ్డే హిందీ సినిమాలో బిజీగా ఉంది. సల్మాన్ ఖాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ మూవీ షూటింగ్ లో యాక్షన్ సీన్స్ చేస్తుండగా గాయపడ్డట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె కాలు విరిగిందా? లేక ప్యాక్చర్ అయ్యిందా? అన్నది క్లారిటీ లేదు. ప్రస్తుతానికి బెడ్ పై విశ్రాంతి తీసుకున్న ఫొటోను షూర్ చేసింది.

ప్రస్తుతం పూజా ఫుల్ బిజీగా ఉంది. ఇటు సల్మాన్ ఖాన్ సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలోనూ నటిస్తోంది. ఇక రణ్ వీర్ సింగ్ సినిమా ‘సర్కస్’లోనూ హీరోయిన్ గా ఉంది. పూజాకు గాయంతో ఈ షూటింగ్ లన్నీ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.