https://oktelugu.com/

Ponniyin Selvan 2 Trailer Review : పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ రివ్యూ: చోళ రాజ్యం మీద పగబట్టిన ఈ నందిని ఎవరు? అంచనాలు పెంచేసిన సీక్వెల్!

Ponniyin Selvan 2 Trailer Review : తమిళ్ మూవీ ప్రైడ్ గా తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా తమ సంస్కృతిలో భాగమని భావించిన కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. టాక్ తో సంబంధం లేకుండా పొన్నియిన్ సెల్వన్ మూవీ చూసేందుకు ఆసక్తి చూపించారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 భారీ సక్సెస్ అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపకున్నా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 30, 2023 / 09:30 AM IST
    Follow us on

    Ponniyin Selvan 2 Trailer Review : తమిళ్ మూవీ ప్రైడ్ గా తెరకెక్కింది పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమా తమ సంస్కృతిలో భాగమని భావించిన కోలీవుడ్ ఇండస్ట్రీ పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ప్రేక్షకులు సైతం ఈ సినిమాను ఓన్ చేసుకున్నారు. టాక్ తో సంబంధం లేకుండా పొన్నియిన్ సెల్వన్ మూవీ చూసేందుకు ఆసక్తి చూపించారు. దర్శకుడు మణిరత్నం తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ 1 భారీ సక్సెస్ అందుకుంది. ఇతర భాషల్లో పెద్దగా ప్రభావం చూపకున్నా తమిళనాడులో రికార్డు వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ ఐదు వందల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.

    కథను మొత్తం సెకండ్ పార్ట్ కోసం దాచడంతో సినిమా మీద ఆసక్తి తగ్గింది. అలాగే లెక్కకు మించిన పాత్రలు ఇతర భాషల ప్రేక్షకులకు ఎక్కలేదు. తమిళ నేటివిటీతో సాగే పీరియాడిక్ పొలిటికల్ డ్రామా తెలుగు, హిందీ భాషల్లో నిరాశపరిచింది. అయితే పార్ట్ 2తో కుంభస్థలాన్ని కొడతాం, రికార్డులు తిరగరాస్తామని తమిళ పరిశ్రమ నమ్మకంతో ఉంది. సమ్మర్ కానుకగా పొన్నియిన్ సెల్వన్ 2 ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ తేదీకి ఉన్న మరొక ప్రత్యేకత బాహుబలి 2 ఇదే తేదీన విడుదల కావడం.

    అరుళ్మోజి(జయం రవి),వల్లవరాయన్(కార్తీ) సముద్రంలో జరిగిన యుద్ధంలో మరణించినట్లు పొన్నియిన్ సెల్వన్ 1 ముగించారు. పార్ట్ 2 అక్కడ నుండే మొదలవుతుంది. అరుళ్మోజి మరణవార్త తెలుసుకున్న కరికాలన్(విక్రమ్) ఏం చేశారు? నందిని(ఐశ్వర్య రాయ్) చోళరాజ్యాన్ని ఎందుకు విచ్ఛిన్నం చేయాలనుకుంటుంది? మాజీ ప్రియుడు కరికాలడిని ఆమె ఎందుకు చంపాలనుకుంటుంది? అరుళ్మోజి, వల్లవరాయన్ ఏమయ్యారు? వాళ్ళను ఎవరు కాపాడారు? వంటి ఆసక్తికర అంశాల సమాహారమే పొన్నియిన్ సెల్వన్ 2.

    విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్, ప్రకాష్ రాజ్, ఐశ్వర్య లేక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, శరత్ కుమార్, ప్రభు, జయరామ్, విక్రమ్ ప్రభు, రెహమాన్ ప్రధాన పాత్రలు చేశారు. కల్కి కృష్ణమూర్తి రాసిన పొన్నియిన్ సెల్వన్ అనే నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతుంది. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ కలిసి నిర్మిస్తున్నారు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. పొన్నియిన్ సెల్వన్ మూవీతో బాహుబలి 2 రికార్డ్స్ బద్దలు కొడతామని కోలీవుడ్ ఇండస్ట్రీ గట్టి విశ్వాసంతో ఉన్నారు. వారి అంచనాలు ఏ మేరకు నెరవేరుతాయా చూడాలి.