Homeట్రెండింగ్ న్యూస్Do cars have caste : పొలిటికల్ సెటైర్: కార్లకు కులమా..? మీ పిచ్చి తగలెయ్య?

Do cars have caste : పొలిటికల్ సెటైర్: కార్లకు కులమా..? మీ పిచ్చి తగలెయ్య?

Do cars have caste : వెర్రి వెయ్యి విధాలు అని మన పెద్దలు ఊరకే అనలేదు. అలాంటి మనుషులు మన ముందు చాలామంది ఉంటారు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన తీరు. సమాజానికి భిన్నంగా వారి ప్రవర్తన ఉంటుంది కాబట్టి మనకు కొంచెం అది తేడాగానే అనిపిస్తుంది. సరే ఈ సువిశాల భారత దేశంలో రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు ఇచ్చింది. మన ఇష్టం వచ్చింది తినొచ్చు. మన ఇష్టం వచ్చింది మాట్లాడొచ్చు. చేతిలో చవకగా జియో నెట్ ఉంటుంది కాబట్టి ఇష్టం వచ్చిన పోస్ట్ పెట్టొచ్చు. ఇంత చదివిన తర్వాత ఇష్టం అనేది ఇందులో కామన్ కాదు.. మనకు అపరిమితమైన స్వేచ్ఛ ఉంది అనేదే కామన్ పాయింట్.ఈ స్వేచ్ఛను  ఒక్కొక్కరు ఒకరకంగా వాడుకుంటారు. అది దాటిపోతేనే తేడా వస్తుంది.
ఈ కుల పిచ్చి ఏమిటి
ఒక ఏడు సంవత్సరాలు వెనక్కి వెళ్తే.. ఓ ప్రాంతంలో భారీ సమావేశం జరుగుతోంది. దానికి 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు అధ్యక్షత వహించి, తన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎలాంటి గొప్ప గొప్ప ఘనకార్యాలు చేసామో.. ప్రజలకు వివరిస్తున్నాడు. సొంత డబ్బా కొట్టుకోవడంలో ఆయనకు ఆయనే సాటి కాబట్టి జనాల చెవుల నుంచి రక్తాలు కారుతున్నాయి. అయినా ఆయన వినిపించుకోవడం లేదు. పైగా అందులో ఆయన కులాల ప్రస్తావన తీసుకొచ్చాడు. ” ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు” అని తన అగ్రకులాహంకర మాటలు మాట్లాడాడు.. దీంతో ఒక్కసారిగా ఆ సభా ప్రాంతం అలా సైలెంట్ అయిపోయింది. ఇక తెల్లారి నుంచి రాష్ట్రం మొత్తం నిరసనలు వెల్లువెత్తాయి. తర్వాత ఆ 40 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడు తదుపరి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 23 సీట్ల దగ్గర ఆగిపోయాడు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలిస్తాడో తెలియదు కానీ.. గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు ప్రాయశ్చిత్తంగా ఆ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు..
ఈ తరంలోనూ..
కులాంతర వివాహాలు, తంతర వివాహాలు జరుగుతున్న ఈ కాలంలోనూ కులాల పిచ్చి తక్కువేమీ లేదు. నడిపే వాహనాల వెనుక తాటికాయతో అక్షరాలతో కులాల పేరు రాసుకోవడం పరిపాటిగా మారింది. అయితే ఈ పిచ్చిని ప్రశ్నిస్తూ రూపొందించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అలాంటి వాటిల్లో ఒక వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక యువకుడు తనకు అత్యవసరమైన పని ఉండడంతో తన స్నేహితుడి కారును అడుగుతాడు. ఆ కారు కొత్తదే అయినప్పటికీ ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాదు. విసిగి వేసారి పోయి తన స్నేహితుడి సహాయం కోరతాడు. దీంతో అతడు వచ్చి ఇతడు మనకులపొడే, వెంటనే స్టార్ట్ కా అనే ఒక కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతాడు. దీంతో కారు వెంటనే స్టార్ట్ అయిపోతుంది. ఈ తతంగాన్ని చూసి అతడి స్నేహితుడు ఆశ్చర్యపోతాడు. కారుకు కులం ఏంటి? అని ప్రశ్నిస్తాడు. కేవలం కారు మాత్రమే కాదు, అందులో కోసే పెట్రోల్ నుంచి ప్రతి ఒక్కటి మా కులం వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకుంటాం అని చెప్పడంతో షాక్ అవడం అతడి స్నేహితుడి వంతవుతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో చూసినవారు కుల పిచ్చి గాళ్లకు సరైన సమాధానం చెప్పారంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular