Viral Video: ఎటువంటి ఒత్తిడి లేకపోతే మనదేశంలో పోలీసులు సూపర్ కాప్స్ కంటే ఎక్కువ పని చేస్తారు. ఇది అనేక సందర్భాల్లో నిరూపితమైంది. కాకపోతే గతంలో జరిగిన కేసులకు సంబంధించి వీడియోలు అందుబాటులో లేవు కాబట్టి మనకు అంతగా తెలియదు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చింది కాబట్టి పోలీసుల ధైర్య సాహసాలు తెలుస్తున్నాయి. వారు చేదించిన కేసులు మనలో సరికొత్తగా స్ఫూర్తిని నింపుతున్నాయి. అటువంటి కేసే ఇది. ఈ కేసులో ఓ పోలీసు అధికారి ధైర్యసాహాసాలు అంతకుమించి అనే విధంగా ఉన్నాయి. ఆ పోలీస్ అధికారి బాడీ లాంగ్వేజ్ కూడా సినిమా హీరోని మించి ఉంది.
ఈ సంఘటన ఇక్కడ జరిగిందో తెలియదు. ఎప్పుడు జరిగిందో తెలియదు. కాకపోతే పూర్తిగా సినిమా స్థాయిలోనే ఉంది. ఈ వీడియోను ఏమీ తెలియకుండా చూస్తే సినిమా అనే అనుకుంటారు. బిజీగా ఉన్న రోడ్డులో పోలీసులను తప్పించుకొని ఓ యువకుడు తన ద్విచక్ర వాహనంతో విన్యాసాలు చేస్తూ ఉంటాడు. అతడిని ఆపేందుకు ఓ పోలీస్ అధికారి ప్రయత్నించగా.. అతడు వెంటనే యూటర్న్ తీసుకొని దూసుకుపోతాడు. కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డు పక్కన ఆగుతాడు. ఆ పోలీస్ అధికారి వెంటనే ఆటోలో వచ్చి ఆ బైకర్ కు సర్ప్రైజ్ ఇస్తాడు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసినందుకు ఆ యువకుడికి భారీగా అపరాధ రుసుం విధించి వెళ్ళిపోతాడు.
వాస్తవానికి ఈ మొత్తం ఎపిసోడ్లో ఆ పోలీస్ అధికారి ధైర్య సాహసాలు అద్భుతం అనే విధంగా ఉన్నాయి. తన నుంచి తప్పించుకోకపోయిన ఆ బైకర్ ను పట్టుకుని అపరాధ రుసుం విధించడం మాత్రమే కాదు.. ఎలా డ్రైవింగ్ చేయాలో.. ఎలా చేయకూడదో ఆ పోలీసు అధికారి ఆ బైకర్ కు చెప్పి వెళ్లిపోతాడు. ఈ వీడియోను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తే ఇప్పటివరకు 3.5 కోట్ల వ్యూస్ లభించాయి. 20కి పైగా లక్షల వ్యూస్ వచ్చాయి. ఆకతాయిలకు ఇలాంటి పోలీసు అధికారులు కరెక్ట్ అని మెజారిటీ నెటిజన్లు పేర్కొంటున్నారు.. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తే ఇలాంటి శిక్షలే విధించాలని సూచిస్తున్నారు. నేటి యువతలో బాధ్యతరాహిత్యం పెరిగిపోయిందని.. అటువంటి వారికి ఇటువంటి గుణపాఠం చెప్పాలని నెటిజన్లు పేర్కొంటున్నారు.