https://oktelugu.com/

Hyderabad: ఏకాంతంగా పార్కుల్లో.. ప్రేమ జంటలకు పోలీస్ మార్క్ పనిష్మెంట్

ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ లో ప్రేమికుల వ్యవహార శైలి పై స్థానికులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో షీ టీం సభ్యులు పలు పార్క్ లను గాలించారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 25, 2024 10:41 am
    Hyderabad

    Hyderabad

    Follow us on

    Hyderabad: “హైదరాబాద్ నగరం విపరీతంగా విస్తరించింది. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే బంగ్లాలు. అలాంటప్పుడు సరదాగా సేద తీరేందుకు పచ్చని ప్రదేశం ఎక్కడ ఉంది? ఉన్న పార్కులు కబ్జా అయ్యాయి.. కొద్దో గొప్పో మిగిలినవి ప్రేమ పక్షులకు ఆలవాలమయ్యాయి. అటువైపు వెళ్లకపోవడమే మంచిది.. ఎటువంటి దృశ్యం చూడాల్సి వస్తుందో మరి” అప్పట్లో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కట్టిన ఓ పోస్ట్ ఇది. అప్పుడు మాత్రమే కాదు ఇప్పటి పరిస్థితులకు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ వంటి ప్రాంతాలు ప్రేమ పక్షులకు అడ్డాలు. కొన్నిసార్లు ఇక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి పార్కులపై పోలీసులు నిఘా పెట్టారు.

    గతంలో ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ మాత్రమే కాకుండా చాలా పార్కులు ఉండేవి. దీంతో ప్రేమికులు ఆ ప్రాంతాలకు వెళ్లి కబుర్లు చెప్పుకునేవారు. కానీ కొంతకాలానికి ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ మినహా మిగతావన్నీ కబ్జాకు గురి కావడంతో ప్రేమికులు పచ్చని ప్రకృతిని ఆస్వాదిస్తూ కబుర్లు చెప్పుకునే వీలు లేకుండా పోయింది. దీంతో వారు ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఫలితంగా ఆ పార్కులపై ప్రేమికుల ఒత్తిడి పెరిగిపోతుంది. పార్క్ లకు వచ్చి కబుర్లు చెప్పుకుని వెళ్ళిపోతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ వారు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో ఇతరులు ఇబ్బంది పడుతున్నారు.

    ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ లో ప్రేమికుల వ్యవహార శైలి పై స్థానికులు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో షీ టీం సభ్యులు పలు పార్క్ లను గాలించారు. ఈ సందర్భంగా పార్క్ లలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్న 12 ప్రేమజంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. బహిరంగ ప్రదేశాలలో ఆ నైతిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక నుంచి పార్కులను సందర్శించేవారు బుద్ధిగా ఉంటామంటేనే అనుమతిస్తామని.. లేకుంటే నిర్మొహమాటంగా బయటికి పంపిస్తామని ప్రకటించారు. 12 జంటలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిన నేపథ్యంలో.. ఇందిరా పార్క్, నెక్లెస్ రోడ్డు, కృష్ణ కాంత్ పార్క్ లను సందర్శించడానికి ప్రేమ జంటలు వెనుకడుగు వేస్తున్నాయి.