Police Viral Video: సినిమాల్లో విలన్లపై మన హీరోలు విరుచుకుపడి దంచి కొట్టడం చూస్తుంటాం. ముఖ్యంగా పోలీస్ వేషాలు వేసిన హీరోలు అయితే కోర మీసంతో కొరకరగా విలన్లను ఏరిపారేస్తుంటారు. బయట మన పోలీసులు ఆ రేంజ్ లో ఫైట్లు చేసిన దాఖలాలు చాలా తక్కువే. చేసినా అవి ఫొటోలు, వీడియోల వరకూ రావు. మనకు కనిపించవు.
కానీ ఈ కేరళ పోలీస్ చేసిన సాహసం మాత్రం నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు. ఒక గుండా చేతిలో పెద్ద ఆయుధం ఉన్నా కూడా వెరవకుండా అతడిపై దూకి తనను తాను కోపాడుకోవడమే కాదు.. ఆ గుండా మెడలు వంచి పట్టుకొని అరెస్ట్ చేసిన ఈ పోలీస్ సాహసానికి నిజంగానే ప్రశంసలు కురుస్తున్నాయి. నిజజీవితంలోనూ ఇలాంటి పోలీస్ సాహసాలను చూస్తామా? అన్నంతగా ఈ వీడియోలో పోలీస్ రెచ్చిపోవడం విశేషం.
కేరళలోని ఒక రహదారి పక్కన ఓ పోలీస్ వాహనం సడెన్ గా వచ్చి ఆగింది. అందులోంచి డోర్ తీసుకొని ఒక పోలీస్ అధికారి దిగుతాడు. ఇంతలోనే ఆ పక్కన బైక్ పై ఉన్న ఓ వ్యక్తి వేట కొడవలితో పోలీస్ పై దాడి చేస్తాడు. దాంతో సదురు పోలీస్ తన చేతుల్లో ఎలాంటి ఆయుధం లేకున్నా కూడా ఏమాత్రం భయపడకుండా ఆ గుండాను ఎదుర్కొన్నాడు. చివరకు ఆ వ్యక్తిని కిందపడేసి మరీ అతడి చేతిలోని ఆయుధాన్ని లాక్కుంటాడు. ఇక ఆ తర్వాత మరో పోలీస్ వచ్చి ఆ ఆయుధాన్ని లాగేసుకుంటారు. అక్కడున్న వారు సాయం చేయడంతో ఆ గుండా ఆటకట్టైంది.
ఏకంగా కత్తితో దాడి చేయడానికి వచ్చినా వెరవకుండా ధైర్యంగా పోరాడిన ఆ పోలీస్ పేరు అరుణ్ కుమార్. అలప్పజ నూరనాడ్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నట్టు తెలిసింది. ఇక ఆ గుండా దాడిలో ఆ పోలీస్ అధికారి చేతికి గాయమై ఏడు కుట్లు కూడా పడ్డాయి. కొడవలితో దాడి చేసిన వ్యక్తిని ‘సుగతన్’గా గుర్తించారు.
ఈ వైరల్ వీడియోను తెలంగాణ ఐపీఎస్ అధికారి స్వాతిలక్రా ట్విట్టర్ లో పంచుకోగా వైరల్ అయ్యింది. అసలైన హీరో ఇలా ఉంటాడు అని ఆమె క్యాప్షన్ జోడించి మరీ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు ఆ పోలీస్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
https://twitter.com/SwatiLakra_IPS/status/1538370942874705920?s=20&t=nCyEkmKtJ_KLdO4zryvMdA
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read More