https://oktelugu.com/

ఏడేళ్ల క్రితం జైలు నుంచి పారిపోయిన వ్యక్తి.. చివరకు..?

ఒక వ్యక్తి ఏడేళ్ల క్రితం ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి దోషిగా తేలింది. కోర్టు జైలు శిక్ష విధించడంతో జైలులో ఉన్న ఆ వ్యక్తి సోదరి పెళ్లి కోసం బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చాక అతని బుద్ధి మారిందో లేక ఎవరైనా సలహా ఇచ్చారో తెలీదు కానీ ఆ వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు దోషి కోసం ఎంతగానో వెతికారు. […]

Written By: , Updated On : October 3, 2020 / 03:13 PM IST
Follow us on

ఒక వ్యక్తి ఏడేళ్ల క్రితం ఒక మహిళను దారుణంగా హత్య చేశాడు. పోలీసుల విచారణలో ఆ వ్యక్తి దోషిగా తేలింది. కోర్టు జైలు శిక్ష విధించడంతో జైలులో ఉన్న ఆ వ్యక్తి సోదరి పెళ్లి కోసం బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే బయటకు వచ్చాక అతని బుద్ధి మారిందో లేక ఎవరైనా సలహా ఇచ్చారో తెలీదు కానీ ఆ వ్యక్తి పోలీసుల కళ్లు గప్పి పారిపోయాడు. ఆ తర్వాత పోలీసులు దోషి కోసం ఎంతగానో వెతికారు. అయితే ఎంత కష్టపడినా అతని ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు.

దీంతో పోలీసులు ఆ వ్యక్తి గురించి పోలీసులు వెతకడం మానేశారు. అలా పారిపోయిన ఆ వ్యక్తి ఒడిశా రాష్ట్రానికి వెళ్లిపోయాడు. అక్కడ ఒక టిఫిన్ సెంటర్ పెట్టుకుని అక్కడే జీవనం సాగించాడు. అయితే ఎట్టకేలకు ఒక చిన్న పని కోసం సొంతూరికి వచ్చి ఆ వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే సార దుర్యోధనరావు అనే వ్యక్తి 2007లో పార్వతి అనే మహిళను దారుణంగా హత్య చేశాడు.

2013 సంవత్సరం ఆగష్టు నెల 3వ తేదీన కోర్టు దుర్యోధనరావుకు జీవిత ఖైదు విధించింది. చెల్లి పెళ్లి కోసం ఎస్కార్ట్ సహాయంతో వెళ్లిన అతను అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తరువాత అక్కడి నుంచి ఒడిశాకు వెళ్లిన దుర్యోధనరావు ఒడిశాలోని కొంధమాల్‌ జిల్లా బల్లిగుడలో హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగించాడు. తన సోదరుడి ఇళ్ల స్థలం వివాదంలో చిక్కుకోవడంతో కాశీబుగ్గకు వచ్చి వెళుతూ ఉండేవాడు.

పోలీసులకు దుర్యోధనరావు ఊళ్లోకి వచ్చినట్టు సమాచారం అందడంతో అతనిని అరెస్ట్ చేసిన పోలీసులు రేపు పలాస కోర్టులో హాజరు పరచనున్నారు. పారిపోయిన జీవితఖైదీని పట్టుకున్న పోలీసులపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.