https://oktelugu.com/

రాహుల్‌ ట్వీట్‌: హత్రాస్‌ కుటుంబాన్ని కలుస్తం.. మమ్మల్ని ఏ శక్తీ అడ్డుకోలేదు..

కామాంధుల దాహానికి బలైన హత్రాస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సంఘటనను కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా.. రాహుల్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపింది. Also Read: కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు ‘హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ బృందం బయల్దేరుతోంది. ఏ శక్తి తమను ఆపలేదని’ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 / 02:55 PM IST
    Follow us on


    కామాంధుల దాహానికి బలైన హత్రాస్‌ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ సంఘటనను కాంగ్రెస్‌ పార్టీ సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. తాజాగా.. రాహుల్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపింది.

    Also Read: కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు

    ‘హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్ బృందం బయల్దేరుతోంది. ఏ శక్తి తమను ఆపలేదని’ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హత్రాస్‌కు బయల్దేరే ముందు రాహుల్ ఈ ట్వీట్ చేశారు. ‘బాధిత కుటుంబాన్నిపరామర్శించడానికి హత్రాస్‌కు బయల్దేరుతున్నాం. వారి బాధను పంచుకుంటాం. తమను ఏ శక్తీ ఆపలేదు.’ అని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. హత్రాస్ బాధిత కుటుంబం విషయంలో యోగి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తాము తట్టుకోలేకపోతున్నామని, నిజమైన భారతీయులెవరూ కూడా తట్టుకోలేరని మండిపడ్డారు.

    అటు.. కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఈ ఘటనపై ఫైర్‌‌ అయ్యారు. యూపీ ప్రభుత్వంపై సీరియస్‌ అయ్యారు. యోగి ప్రభుత్వం నైతికంగా అవినీతిమయమైందని ధ్వజమెత్తారు. బాధితురాలికి సరైన వైద్యం కూడా అందలేదని, ఆమె మృతదేహాన్ని బలవంతంగా తగలబెట్టారని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని బందీ చేశారని, నార్కో పరీక్షలు నిర్వహిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. బాధిత కుటుంబంపై పోలీసులు, ప్రభుత్వ తీరు ఏమాత్రం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తంచేశారు.

    Also Read: దేశ భద్రతలో రాజీపడేది లేదన్న మోడీ

    మరోవైపు.. రాహుల్‌ ట్వీట్‌తో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. రాహుల్‌ బయల్దేరుతున్న నేపథ్యంలో గ్రేటర్‌‌ నోయిడా ప్రాంతంలోని ఢిల్లీ ప్లాజా వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్లాజాను కూడా పూర్తిగా మూసివేశారు. ఈ క్రమంలో రాహుల్‌ అన్ని అడ్డంకులను దాటి హత్రాస్‌ కుటుంబాన్ని ఎలా చేరుతారో ఆసక్తిగా మారింది.