
Phalana Abbayi Phalana Ammayi Collection: యువ హీరోలలో అందం , టాలెంట్ ఉన్నప్పటికీ కూడా స్క్రిప్ట్ సెలక్షన్ సరిగా ఎంచుకోక కెరీర్ లో అందరికంటే వెనుకబడిన హీరోలలో ఒకడు నాగ శౌర్య.ఈయన హీరో గా నటిస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి.గత ఏడాది విడుదలైన ‘కృష్ణ వృందా విహారి’ అనే చిత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఆడింది.
ఆ తర్వాత ఆయనకీ కెరీర్ లో మొట్టమొదటి సూపర్ హిట్ చిత్రాన్ని ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తో కలిసి లేటెస్ట్ గా ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ అనే సినిమా తీసాడు.నిన్న గ్రాండ్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చింది.సినిమా పరమ బోరింగ్ గా ఉందంటూ రివ్యూస్ వచ్చాయి.కానీ అవసరాల శ్రీనివాస్ డైరెక్టర్ కదా కనీస స్థాయిలో అయినా ఓపెనింగ్స్ ఉంటుందేమో అని ఆశించారు.కానీ విడుదలైన అన్నీ కేంద్రాలలో ఈ చిత్రం నిన్న మార్నింగ్ షోస్ నుండే నష్టాలతో ప్రారంభం అయ్యింది.

ఫలితంగా నాగ శౌర్య కెరీర్ లోనే బిగెస్ట్ డిజాస్టర్ ఓపెనింగ్స్ గా నిల్చింది.రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి ఈ సినిమాకి మొదటి రోజు కేవలం 85 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి.ఇది అత్యంత దారుణమైన ఓపెనింగ్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇది పెద్ద కాంబినేషన్.గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఊహలు గుసగుసలాడే’ అనే చిత్రం విడుదలై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో అంత తేలికగా మర్చిపోగలమా.ఆ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కాబట్టి, అందులోనూ అవసరాల శ్రీనివాస్ రైటింగ్ కి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి మినిమం గ్యారంటీ ఓపెనింగ్ ని ఆశించారు.

కానీ ప్రింట్ ఖర్చులకు అవసరం అయ్యే వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.ఇలా డిజాస్టర్ ఫ్లాప్ అవ్వడానికి కారణం సరైన టీజర్ మరియు ట్రైలర్ లేకపోవడమే.ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ లో కేవలం టీజర్స్ మరియు ట్రైలర్స్ మాత్రమే సినిమా ఫలితాన్ని నిర్ణయిస్తుంది..ఈ చిత్రానికి అదే లోపించింది అని అంటున్నారు ట్రేడ్ పండితులు.