Mermaid in America: మత్స్య కన్య గురించి మనం చిన్నప్పుడు చదువుకున్నాం. కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆ మధ్య తెలుగు సినిమా సాహసవీరుడు సాగరకన్యలో శిల్పాశెట్టిని సాగరకన్యగా చూపించారు. అద్భుతంగా నటించిన ఆమె ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా అమెరికాలో ఓ యువతి మత్స్యకన్యగా మారి అందరిని ఆకర్షిస్తోంది. మత్స్య కన్య అంటే ఇలా ఉంటుందా అని అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఇందుకు గాను ఆమె ప్రతి నెల రూ.6 లక్షలు సంపాదించుకోవడం గమనార్హం. మత్స్య కన్యగా మారిన ఆమె తన అవకాశాలను విస్తృతం చేసుకుంటోంది. పలు ఈవెంట్లలో తన ప్రదర్శన చేస్తూ డబ్బులు సంపాదించుకుంటోంది.

అమెరికాకు చెందిన 32 ఏళ్ల ఎమిలీ అలెగ్జాండ్రా గుగ్లీల్మో ఫ్లోరిడాలో నివసిస్తోంది. మత్స్యకన్యగా మారిన ఆమె పిల్లల పార్టీలతో పాటు ఐదు నక్షత్రాల హోటళ్లలో ఈవెంట్లు చేస్తోంది. దీంతో ఆమె సామాజిక మాధ్యమాల్లో మిలియన్ల అనుచరులు ఆమెకు ఫాలోవర్స్ గా మారుతున్నారు. రోజంతా స్విమ్మింగ్ ఫూల్ లో మత్స్యకన్యగా గడుపుతోంది. అయితే తనకు ప్రజల నుంచి పలు డిమాండ్లు వస్తున్నాయి. టాప్ లెస్ గా కనిపించాలని పలువురు కోరుతున్నారని చెబుతోంది. కానీ వారి కోరికను తీర్చాల్సిన అవసరం రావడం లేదు. ఆమెను చూసేందుకు జనం ఎగబడుతున్నారు. జలకన్య ఎలా ఉంటుందోననే ఆతృత వారిలో నెలకొంటోంది.
మత్స్య కన్యగా ఉండటం తన జీవిత కాల వాంఛ అని తెలుపుతోంది. మత్స్య కన్యగా ఉంటూ అందరిని ఆకర్షించడం ఆనందంగా ఉందని పేర్కొంది. తన ఇరవై రెండేళ్ల వయసులోనే మత్స్య కన్యగా మారాలనే ఆలోచన వచ్చింది. దీనికి గాను మూడున్నర వేల డాలర్లు ఇస్తున్నారు. పార్టీలు, ఈవెంట్లకు తనను నియమించుకోవడం సంతోషం కలిగిస్తోందని చెబుతోంది. స్విమ్మింగ్ ఫూల్ అడుగు భాగంలో ఈవెంట్ల కోసం బుక్ చేసుకుంటున్నారు. దీంతో ప్రజల ఆనందం కోసం తాను ఈ అవతారం ఎత్తానని చెబుతోంది.

దీనికి ఆమె ప్రియుడు కూడా ఓకే చెబుతున్నాడు. దీంతో ఆమె వీడియోల్లో సెక్స్ గా కనిపించాలని ప్రజలు కోరడంతో సున్నితంగా తిరస్కరిస్తోంది. పలు టీవీ షోల్లో కూడా కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. దీంతో మత్స్యకన్యగా మారిన అలెగ్జాండ్రా రెండు చేతులా సంపాదిస్తున్న కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మత్స్యకన్యగా తనదైన శైలిలో రాణిస్తూ ముందుకెళ్తోంది. తనతో పరిచయం ఉన్న పురుషులతో పరిచయాలు ఏర్పడుతున్నందున కొన్ని సమస్యలు కూడా వస్తున్నాయని చెబుతోంది.