
Pawan Kalyan Unstoppable: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.ఎంత మంది హీరోలొచ్చినా, ఎన్ని పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ కొట్టిన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ రేంజ్ ని ఎవ్వరూ మ్యాచ్ చెయ్యలేరని అంటుంటారు విశ్లేషకులు.అందుకు ఎన్నో ఉదాహరణలు మనం చూసాము, రీసెంట్ గా మరో ఉదాహరణని ఇప్పుడు మనం చూస్తున్నాము.
అసలు విషయానికి వస్తే ఈ ఏడాది ఫిబ్రవరి 2 వ తారీఖున ఆహా మీడియా లో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యహరించిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో లో ముఖ్య అతిథి గా పాల్గొన్న సంగతి తెలిసిందే.ఈ ఎపిసోడ్ ని రెండు భాగాలుగా చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని షూట్ చేసారు.విపరీతమైన ట్రాఫిక్ వస్తుంది అనే విషయాన్నీ గ్రహించి ప్రత్యేకంగా రెండు బ్యాకప్ సర్వర్లు కూడా ఏర్పాటు చేసారు.అయ్యినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ అభిమానుల తాకిడిని తట్టుకోలేకపోయింది ఆహా యాప్.
అప్పట్లో ఓటీటీ హిస్టరీ లోనే ఎవరికీ సాధ్యపడని రికార్డ్స్ ని నెలకొల్పిన ఈ ఎపిసోడ్, ఇప్పటికీ అదే స్థాయి జోరుని కొనసాగిస్తూ ముందుకు దూసుకుపోతుంది.సుమారుగా రెండు నెలల నుండి గ్యాప్ లేకుండా,ఆహా మీడియా లో ఎన్ని కొత్త సినిమాలను, ఎన్ని కొత్త ప్రోగ్రామ్స్ ని అప్లోడ్ చేసినా ట్రేండింగ్ అవుతూనే ఉంది ఈ ఎపిసోడ్.

అన్ స్టాపబుల్ షో లో ఇదివరకు ఎంతోమంది స్టార్ హీరోలొచ్చారు, కానీ ఎవరికీ ఈ రేంజ్ రెస్పాన్స్ రాలేదు, కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే వచ్చింది.దీనిని బట్టీ ఆయన ఇప్పుడు ఉన్న స్టార్ హీరోలందరికంటే పెద్ద హీరో అనే విషయం అర్థం అవుతుందని ఈ సందర్భంగా విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.రాబొయ్యే రోజుల్లో ఈ ఎపిసోడ్ ఇంకెన్ని రికార్డ్స్ ని నెలకొల్పుతుందో, ఇంకెన్ని రోజులు నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతుందో చూడాలి.