
Unstoppable With NBK Pawan Kalyan: కోట్లాది మంది అభిమానులు ఆరాధ్య దైవంగా భావించే పవన్ కళ్యాణ్ గురించి ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి అనే కోరిక ఉండడం సహజం..కానీ స్వతహాగా పవన్ కళ్యాణ్ కి టాక్ షోస్ లో ఇంటర్వ్యూస్ లో పాల్గొనడం ఇష్టం ఉండదు కాబట్టి ఇన్ని రోజులు ఆయనలో ఎలాంటి కోణాలు ఉంటాయి, ఆయన ఆలోచన విధానం ఎలా ఉండేది వంటి ప్రశ్నలకు మనకి జవాబు దొరికేది కాదు.
Also Read: BJP Focus Telangana: తెలంగాణలో మోదీ మేనియా.. ఎన్నికల్లో ఎంతవరకు పనిచేస్తుందో!?
అలాంటి సమయం లో ఆహా మీడియా మరియు బాలయ్య బాబు పుణ్యమా అని ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ షో పవన్ కళ్యాణ్ ని టాక్ షో కి తీసుకొచ్చింది..ఈ టాక్ షోని ఆహా మీడియా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది..మొదటి ఎపిసోడ్ ని గత కొద్దీ రోజుల క్రితమే విడుదల చెయ్యగా దానికి వచ్చిన అపూర్వ స్పందన మామూలుది కాదు, ఆహా మీడియా లెక్కల ప్రకారం ఈ ఎపిసోడ్ ఇండియా లో ఉన్న అన్నీ రికార్డ్స్ ని బద్దలు కొట్టిందనే చెప్పొచ్చు.
అది కేవలం మొదటి భాగం కి వచ్చిన రికార్డ్స్ మాత్రమే..రెండవ భాగం నిన్న స్ట్రీమింగ్ చెయ్యగా దానికి మొదటి భాగం కంటే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది..ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ ని అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్న కి పవన్ కళ్యాణ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది..అయన కళ్యాణ్ ని ప్రశ్న అడుగుతూ ‘ఏ పార్టీ పెట్టినా ఎన్టీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలను,ఆశయాలను తీసుకునే పెడుతున్నారు..జనసేన పార్టీని కూడా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ఉన్నటువంటి సిద్దాంతాలతోనే ప్రారంభించారు..అలాంటప్పుడు నువ్వు నేరుగా టీడీపీ లోనే చేరిపోయియుండొచ్చు కదా..పార్టీ ఎందుకు పెట్టావు’ అని అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్తూ..

‘వాస్తవాలు మాట్లాడుకుంటే అధికారం అనేది కేవలం రెండు కులాలకు మాత్రమే పరిమితం అయ్యిపోయింది..క్రింది కులాలకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి కానీ, ఆధిపత్య ధోరణి వాళ్లకి ఇప్పటికి లభించలేదు..అలాంటి వాళ్లందరికీ అధికారం సమానం గా రావాలనే ఆలోచనతోనే పార్టీ పెట్టాను.నేను వేరే పార్టీ లో చేరడం వల్ల నా ఆలోచనలు,ఆశయాలు అన్నీ ఒక పరిమితి మేరకే స్థిరపడిపోతాయి,నా ఆశయాలు సిద్ధాంతాలను సంపూర్ణంగా జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే పార్టీ పెట్టడమే కరెక్ట్ అనిపించింది’ అంటూ పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు.
Also Read: Unstoppable with NBK -Pawan : అన్నయ్య చిరంజీవిలో నాకు నచ్చనివి ఇవే.. పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్