
Ravindra Jadeja- Steve Smith: క్రికెట్ లో ఎన్నో అద్భుతాలు జరుతుంటాయి. కొన్ని సందర్భాలలో అత్యద్భుతాలు జరుగుతాయి. వాటిల్లో జడేజా తీసిన స్మిత్ వికెట్ ముందు వరుసలో నిలుస్తుంది. నాగ్ పూర్ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో టాస్ గెలిచి ఆస్ట్రేలియా బ్యాటింగ్ కు దిగింది. ప్రారంభంలోనే షమీ, సిరాజ్ ఆసీస్ జట్టుకు దమ్కీ ఇచ్చారు. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన ఆసీస్ ను లబు షేన్, స్మిత్ కాపాడేందుకు కంకణం కట్టుకున్నారు.
కుదురుకుంటున్న ఈ జోడిని జడేజా విడదీశాడు. జడేజా వేసిన ఒక బంతిని తప్పుగా అంచనా వేసిన లబు షేన్ క్రీజు దాటాడు. దీంతో యువ వికెట్ కీపర్ కేఎస్ భరత్ వెంటనే స్టంప్ ఔట్ చేశాడు. ఒకప్పటి ధోని ని గుర్తు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా మరిన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళింది. ఇదే దశలో బౌలింగ్ వేసిన జడేజా ఆసీస్ స్టార్ బ్యాట్స్ మెన్ స్మిత్ వికెట్ తీశాడు. కానీ దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

అప్పటికే క్రీజులో పాతుకు పోయేందుకు స్మిత్ ప్రయత్నం చేస్తున్నాడు. పైగా లబు షేన్ ఔట్ కావడంతో జట్టు భారం కూడా స్మిత్ పై పడింది. ఈ నేపథ్యంలో స్మిత్ ను జడేజా అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ఇన్నింగ్స్ 42వ ఓవర్ లో జడేజా వేసిన ఆఖరి బంతికి స్మిత్ డిఫెన్స్ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే ఆఫ్ సైడ్ పడిన బంతి ఒక్కసారిగా టర్న్ అయ్యి స్మిత్ బ్యాట్, ప్యాడ్ మధ్య నుంచి స్టంప్స్ ను గిరాటేసింది. కళ్ళు తెరచి చూసే లోగా వికెట్ పోయింది. దెబ్బకు స్మిత్ మైండ్ బ్లాంక్ అయింది.
That when @imjadeja let one through Steve Smith’s defence!
Follow the match ▶️ https://t.co/SwTGoyHfZx #TeamIndia | #INDvAUS | @mastercardindia pic.twitter.com/Lj5j7pHZi3
— BCCI (@BCCI) February 9, 2023